Nagashvin : స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అపజయం అంటూ ఎరగని డైరెక్టర్లలో ఆయన కూడా ఉంటారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా.. నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ప్రభాస్ తో తీసిన కల్కి సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. అలాంటి నాగ్ అశ్విన్ కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. నాగ్ అశ్విన్ తన సినిమాలకు దాదాపుగా ఆయనే కథలు రాసుకుంటారు. డైలాగులు కూడా ఆయనవే ఉంటాయి. తాజాగా ఓ కాలేజీ స్టూడెంట్లతో ఆయన ముచ్చటించారు. ఇందులో కొత్త కథలు రాసుకోవడం చాలా కష్టం కదా అని ఓ ప్రశ్న వచ్చింది.
Read Also : Sunil Balusu: టాలీవుడ్ నిర్మాతలపై ఓటీటీ పెత్తనం.. యంగ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘అవును కొత్త తరహా కథలు రాయడం చాలా కష్టం. ఎందుకంటే మనం రాసుకునే కథలు.. కొన్ని రోజులకు వేరే వాళ్లకు అవే ఐడియాలు వచ్చి రాసుకోవచ్చు. వేరే సినిమాలు, ట్రైలర్ లో అవే కాన్సెప్టులు కనిపిస్తాయి. నేను 2008లో జ్ఞాపకాలు, కలల నేపథ్యంలో ఓ కథ రాసుకున్నాను. కానీ అదే కాన్సెప్టులో హాలీవుడ్ లో ఇన్ సెప్షన్ అనే ట్రైలర్ వచ్చింది. అది చూసి వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. కానీ మళ్లీ కథలు రాసుకవడం ఆపలేదు’ అంటూ తెలిపారు. కలలు అనే కాన్సెప్టుతో 2010లో హాలీవుడ్ లో వచ్చిన ఇన్ సెప్షన్ అనే మూవీ భారీ విజయం సాధించింది. ఒకవేళ అది రాకపోయి ఉంటే నాగ్ అశ్విన్ నుంచే ఆ భారీ మూవీ వచ్చేదేమో అంటున్నారు ఆయన ఫ్యాన్స్.