Trolls On Vijay Deverakonda Before Becoming Hero: విజయ్ దేవరకొండకు ట్రోల్స్ అంటే అసలు భయం లేదట! ఎందుకంటే ఆయన హీరోగా తెరపై కనిపించక ముందు నుంచే ‘ట్రోల్స్’ అన్నవి రుచి చూశాడట. వింటూంటేనే విడ్డూరం అనిపిస్తోంది కదూ! కానీ, అది నిజమట! విజయ్ చదువుకొనే రోజుల్లో ఆయన బంధువులు ఫోన్ చేసి, “మా వాడికి ఫలానా ర్యాంక్ వచ్చింది. నీకే ర్యాంక్ వచ్చింది” అంటూ ప్రశ్నించేవారట! అప్పట్లో వారి ఫోన్స్ ఇప్పటి ట్రోల్స్ కన్నా మిన్నగా భయపెట్టేవట! ఆ తరువాత చుట్టుపక్కల ఉన్నవారు ‘ఏం చేస్తున్నావ్ బాబూ… ఊరికే తిరగకుంటే ఏదైనా పనిచేసుకోవచ్చు కదా…’ అంటూ సలహాలు ఇవ్వడం కూడా ట్రోల్స్ లాగే అనిపించేవట. అందువల్ల సినిమాల్లోకి రాకముందే తాను ట్రోల్స్ చూశానని, అవి అలవాటై పోవడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ భయపెట్టడం లేదని విజయ్ దేవరకొండ ‘లైగర్’ ప్రెస్ మీట్ లో సెలవిచ్చాడు.
విజయ్ పై అదే పనిగా ట్రోల్స్ రావడానికి ఆయన హీరోగా నటిస్తున్న తొలి రోజుల్లోనే తన ‘పెళ్ళిచూపులు’ సినిమా ఇరగదీస్తాదని, హిట్టు ఖాయమని చెబుతూ వచ్చాడు. దాంతో సోషల్ మీడియాలో “వీడేంట్రా… ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే… ఎక్స్ ట్రాలు చేస్తున్నాడు…” అంటూ ట్రోల్స్ వచ్చాయి. అవి చూసి సరదా అనిపించిందట. అయితే చిన్నప్పటి బంధువులు, ఇరుగుపొరుగువారు అన్న మాటల కంటే ఈ ట్రోల్స్ సరదాగా ఉన్నాయని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాడు ‘లైగర్’. మరి ‘లైగర్’ రిలీజ్ అయ్యాక విజయ్ పై ఎలాంటి ట్రోల్స్ వస్తాయో చూడాలి.