ఒకప్పుడు బాక్సాఫీసును షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలామాలో పడిపోయింది. పీఎస్వీ గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. తన కోస్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులతో వర్క్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉంటే ఒకప్పటి ఈ స్టార్ హీరో మాత్రం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతిబాబులా స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్టవుదామని ఓ ట్రైలేస్తే బెడిసి కొట్టింది. ఎక్స్ ఆర్డినరీ మ్యాన్‌లో స్పెషల్ క్యామియో చేస్తే పెద్దగా ఇంపాక్ట్ కాలేదు రోల్. నెక్ట్స్ బైకర్ రిజల్ట్ తేలాల్సి ఉంది.
సపోర్టింగ్ క్యారెక్టర్లకు షిఫ్టైనా మెయిన్ క్యారెక్టర్లపై మక్కువ చంపుకోని రాజశేఖర్ ఓ రిస్క్ చేయబోతున్నాడు. తమిళంలో హిట్టై, ఓటీటీ ఆడియన్స్ చూసేసిన లబ్బర్ పందు హక్కులు కొనుగోలు చేశారు. ఐవీ శశి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో హారీష్ కళ్యాణ్ క్యారెక్టర్‌లో 35 చిన్న కథ కాదు ఫేం విశ్వ దేవ్, దినేష్ రోల్ లో రాజశేఖర్ నటిస్తున్నాడు. విశ్వకు జోడీగా శివానీ రాజశేఖర్ నటిస్తోంది. రాజేశేఖర్ కు జోడిగా సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణను తీసుకున్నారు. ఒకప్పటి స్టార్ కపుల్ రాజశేఖర్, రమ్యకృష్ణ 27 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇప్పుడు లబ్బరు పందు రీమేక్‌లో కలిసి యాక్ట్ చేయబోతున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా సినిమా చేస్తున్న రాజశేఖర్ లబ్బర్ పందు తెలుగు రీమేక్ బిగ్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.