Tollywood Biggies Met Minister Komatireddy Venkat Reddy: తెలంగాణలో 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తెలంగాణ రోడ్లు భవనాల శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఈ మధ్యనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు కూడా స్వీకరించి సెక్రటేరియట్ లోని చాంబర్లో కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలోనే తనకు దిల్ రాజు ఒక్కడే కాల్ చేసి విష్ చేశాడని అయన తప్ప మరెవరూ విష్ చేయలేదని అన్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వెళ్లి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు.
Sandeep Reddy Vanga: నీ నెక్స్ట్ సినిమాలు తలుచుకుంటేనే భయమేస్తుంది మావా…
తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ నుంచి ప్రముఖులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. నిర్మాతలు దిల్ రాజు, సుధాకర్ రెడ్డి, సురేష్ బాబు, సి కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నట్టి కుమార్ వంటి వారి మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఇక సినీ కార్మికులకు ఉన్న కష్టాలు, జూనియర్ ఆర్టిస్టులకు ఉన్న సమస్యలు, షూటింగ్ కోసం కొత్త పర్మిషన్లు ఇలా..సంక్షేమం వంటి విషయాల్లో ఎలాంటి కొత్త నిర్ణయాలతో మంత్రిత్వ శాఖ సహకరిస్తుందేమో చూడాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సమానంగా అందరికీ నంది అవార్డులు ఇచ్చిన విషయం తెల్సిందే, త్వరలోనే నంది అవార్డుల విషయం మీద ఒక ఒక నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డిని కలిసి కోరినట్టు తెలుస్తోంది.