Virupaksha Trailer: రుద్రవనాన్ని కాపాడే విరూపాక్ష వచ్చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thriller Trailer Released From Virupaksha: రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. చిత్రబృందం ఆల్రెడీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మొదటి నుంచి చివరివరకు.. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ, ఈ ట్రైలర్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. కంటెంట్ ఏంటనేది స్పష్టంగా రివీల్ చేయలేదు కానీ, త్రిల్లింగ్ అంశాలు బాగానే ఉన్నాయి.
Extramarital Affair: జ్యోతిష్యుడి మెడకు చుట్టుకున్న ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి బలి
Also Read
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
ఈ ఊరికి రాకపోకలు నిషేదం అనే హెచ్చరికతో స్టార్ట్ అయ్యే ఈ ట్రైలర్.. వెంటనే రొమాంటిక్ యాంగిల్ టర్న్ తీసుకుంటుంది. సాయితేజ్, సంయుక్తం మీనన్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. అనంతరం ట్రైలర్ ఒక్కసారిగా త్రిల్లింగ్‌గా మారుతుంది. ప్రశాంతంగా కనిపించే ఆ ఊరిలో ఏదో కీడు జరుగుతోందని, ఏవో కనిపించని శక్తులు ఆ ఊరి జనాల్ని హరిస్తోందని హీరో పసిగడతాడు. ఇంతకీ ఆ కనిపించని శక్తులేంటి? వాటి నుంచి ఆ ఊరి ప్రజల్ని ఎలా కాపాడుతాడు? అనే చిక్కుముడులకు సమాధానమే ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది. ఇక విజువల్స్ అయితే మైండ్బ్లోయింగ్గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సబ్జెక్ట్‌కి సరిగ్గా కుదిరింది. ఓవరాల్‌గా ట్రైలర్ బాగుంది. మరి.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు.. ఈ ట్రైలర్లో సంయుక్త అందంగా మెరవడంతో పాటు ఆమె పాత్ర చుట్టూ ఏదో సస్పెన్స్ కూడా దాగి ఉండటాన్ని గమనించవచ్చు.
Bholaa Movie: భార్యతో కలిసి సినిమా చూశాడు.. డబ్బు ఖర్చు చేసిందని కొట్టాడు
కార్తిక్ దండు స్వీయ రచనా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించాడు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇదొక మిస్టికల్ త్రిల్లర్ కావడంతో.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సునీల్‌తో పాటు బ్రహ్మాజీ, అజయ్, అభినవ్ గోమఠం, ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?