50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- డిస్ప్లే: 6.83 అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- కెమెరా: 50MP Sony IMX852 మెయిన్ కెమెరా, 2MP బొకే కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్.
- సెల్ఫీ కెమెరా: వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా.
- ప్రాసెసర్: 4nm ప్రాసెస్‌పై తయారైన MediaTek Dimensity 7360-Turbo చిప్సెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo V80 Lite 5G: వివో (Vivo) నుండి కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. Vivo V80 లైట్ 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ప్రీమియం డిజైన్‌తో పాటు డివైస్‌కు IP68, IP69 రేటింగ్స్ కూడా అందించారు.
ఈ కొత్త మొబైల్ లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 449ppi పిక్సెల్ డెన్సిటీతో పనిచేస్తుంది. డిస్ప్లే గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. కర్వ్డ్ డిస్ప్లేతో ఫోన్ ముందు భాగం ప్రీమియం లుక్‌ను కలిగి ఉండగా.. వెనుక భాగంలో హారిజాంటల్ కెమెరా బార్‌ను అందించారు. ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిమెట్రికల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం Vivo V80 Lite 5Gలో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ IMX852 మెయిన్ కెమెరాతో పాటు 2MP బొకే కెమెరా అందించారు. వీటికి రింగ్ LED ఫ్లాష్‌ను జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
Also Read
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm ప్రాసెస్‌పై తయారైన MediaTek Dimensity 7360-Turbo చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 8GB LPDDR4X RAM అందించారు. స్టోరేజ్ విషయానికి వస్తే 128GB, 256GB UFS 3.1 స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. అదనంగా 8GB వరకు ఎక్స్టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. సాఫ్ట్వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించిన OriginOS 6పై ఫోన్ పనిచేస్తుంది. వివో V80 లైట్ 5Gలో 7,050mAh బ్యాటరీ అందించారు. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్లో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా Bluetooth 5.4, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB 2.0 Type-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
డ్యూరబిలిటీ విషయంలో Vivo V80 Lite 5Gకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఫోన్‌కు IP68, IP69 రేటింగ్స్ లభించాయి. దీంతో దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఫోన్ ఐదు MIL-STD-810H సర్టిఫికేషన్లను పొందింది. ఏడు రకాల ఉపరితలాలపై డ్రాప్ టెస్టింగ్ కూడా నిర్వహించినట్లు కంపెనీ పేర్కొంది. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే సాప్ఫిరే బ్లూ, సిల్క్ వైట్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ మొబైల్ పాకిస్థాన్‌లో లాంచ్ కాగా.. అక్కడ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వాటి ధరలు ఇలా ఉన్నాయి.
* 8GB + 128GB: PKR 124,999 (సుమారు $450).
* 8GB + 256GB: PKR 145,999 (సుమారు $525).
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!