Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్స్‌కు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదు. దొరికితే కచ్చితంగా హీరోలను డామినేట్ చేసేస్తారు అందులో నో డౌట్. తమిళంలో రీసెంట్ టైమ్స్‌లో అలాంటి కొన్ని ఫీమేల్ రోల్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ థాయి కిళవి ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మే అయినప్పటికీ.. పవన్ తాయిగా రాధికా శరత్ కుమార్ నటనను అంత ఈజీగా మర్చిపోలేరు తమిళ తంబీలు. రాధిక నటనే కానీ, మేకప్ కోసం ఆమె పడ్డ కష్టమే కానీ టాప్ నాచ్ అంతే. విశ్వనాథ్ అండ్ సన్స్‌లో కూడా మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది సీనియన్ నటీమణికి.
ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్‌కే పరిమితమైన ప్రీతి ముకుందన్లోని అసలు సిసలైన ఫెర్ఫామెన్స్ బయటకు తీసిన సినిమా బ్లాస్ట్. పేరుకు అర్జున్ సార్జా హీరో కానీ ఇందులో స్ట్రాంగ్ లేడీగా విలన్స్‌ను రప్ఫాడించే సగటు యువతిగా కనిపించి ఆకట్టుకుంది ప్రీతి. అలా అని అభిరామిని తక్కువగా చూపించలేదు. ఆమెకివ్వాల్సిన స్కోప్ ఆమెకు ఇచ్చేశాడు డైరెక్టర్. లోకేశ్ కనగరాజ్ హీరోగా రీసెంట్లీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డీసీలో వామికా గబ్బీ రోల్‌ను స్ట్రాంగ్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్. చంద్ర పాత్రలో ఆమె నటించిన తీరు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సూర్య ఉన్నాడంటే మరొకరి స్కోప్ ఉండదు.. స్క్రీన్ ప్రజెన్స్ అంతా తన నటనతో నమిలేస్తాడు. అలాంటిది విశ్వనాథ్ అండ్ సన్స్‌లో మమితా బైజుకు స్కోప్ ఉన్న పాత్ర రాశాడు వెంకీ అట్లూరీ. మ్యాడీ రోల్లో ఎనర్జటిక్‌గా నటించి ఆడియన్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకుంది మమిత. ఇదే కాదు 29లో ప్రీతి ఆస్రానీ క్యారెక్టర్, విత్ లవ్‌లో అనశ్వర రాజన్ రోల్స్ కూడా హీరోలతో సమానంగా క్యారెక్టర్స్ డిజైన్ చేశారు మేకర్స్. హీరోయిన్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలే అవసరం లేదని ఫ్రూవ్ చేస్తున్న తమిళ్ మేకర్స్‌ను చూసి.. తెలుగు మేకర్స్ ఇన్ స్పైర్ అవుతారా..?
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!