Astrologer Killed By Her Lover In Tamilnadu For Money: అతను ఓ జ్యోతిష్యుడు. వయసు 60 సంవత్సరాలు. అతనికి భార్య కూడా ఉంది. అయినా సరే.. తన వద్దకు జ్యోతిష్యం కోసం వచ్చే మహిళల్ని ముగ్గులోకి దింపి, వారితో వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడు. ముఖ్యంగా.. విడాకులు తీసుకున్న లేదా వితంతువులైన మహిళల్ని టార్గెట్ చేసేవాడు. అయితే.. ఒక బంధం మాత్రం అడ్డం తిరిగింది. ఆస్తి కోసమే తన వద్దకు వచ్చిన విషయాన్ని అతడు గుర్తించలేకపోయాడు. గుర్తించేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పక్కా స్కెచ్ వేసి మరీ, ఓ మహిళ ఆస్తి కోసం ఆ జ్యోతిష్యుడి అంతమొందించింది. చివరికి బండారం బయటపడటంతో, పోలీసులకు దొరికిపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Bholaa Movie: భార్యతో కలిసి సినిమా చూశాడు.. డబ్బు ఖర్చు చేసిందని కొట్టాడు
తమిళనాడులోని నామక్కల్ జిల్లా సెందమంగళం సమీపంలో సుందర్ రాజన్ (60) అనే జ్యోతిష్యుడు నివసిస్తున్నారు. ఇతనికి భార్య బేబీ (55), ఇద్దరు కుమారులు ఉన్నారు. కట్ చేస్తే.. అదే ప్రాంతానికి చెందిన పరమేశ్వరి(48) అనే మహిళ జ్యోతిష్యం కోసం సుందర్‌రాజన్‌ను కలిసింది. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులుగా మారారు. భర్త నుంచి దూరంగా ఉంటోంది కాబట్టి.. సుందర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భార్య బేబీకి తెలిసి భర్తను నిలదీసింది. పరమేశ్వరికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. అయినా అతడు మారకపోవడంతో.. భర్తని వదిలి బేబీ వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయాక సుందర్ ఇంట్లోకి పరమేశ్వరి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అతనికి మాయమాటలు చెప్పి.. ఆ ఇంటిని తన పేరుపై రాయించుకుంది. సుందర్ వద్ద భారీ డబ్బుతో పాటు మరో ఇల్లు కూడా ఉందన్న విషయం తెలుసుకున్న పరమేశ్వరని.. అవన్నీ తనకే అప్పగించాలని మొండికేసింది.
Adipurush: మరో వివాదంలో ఆదిపురుష్.. తన ఆర్ట్ కాపీ కొట్టారంటూ..
కానీ.. సుందర్‌రాజన్ అందుకు ఒప్పుకోలేదు. ఆల్రెడీ ఒక ఇంటిని రాసిచ్చానని, మరో ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వనని తేల్చి చెప్పాడు. దీంతో పరమేశ్వరి అతడ్ని చంపాలని ప్లాన్ చేసింది. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే.. పరమేశ్వరికి ఆల్రెడీ ఒక ప్రేమికుడు ఉన్నాడు. డబ్బు కోసమే సుందర్‌కి దగ్గరయ్యింది. ఆస్తి కాజేసి, ప్రియుడితో హ్యాపీగా బతకాలన్న ఉద్దేశంతోనే ఈ వివాహేతర సంబంధం స్కెచ్ వేసింది. సుందర్ తనకు మరో ఇల్లు, డబ్బు ఇవ్వలేదు కాబట్టి.. అతడ్ని చంపితే తనకే అవన్నీ సొంతం అవుతాయని భావించింది. ప్రియుడితో కలిసి సుందర్‌ని చంపేందుకు పరమేశ్వరి పథకం రచించింది. ప్లాన్ ప్రకారం.. పరమేశ్వరి తన ప్రియుడితో కలిసి సుందర్‌రాజన్ ఇంటికి వెళ్లింది. లోపలికి వెళ్లిన తర్వాత తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Nirmala Sitharaman: భారత్ లో ముస్లింల జనాభా అధికం.. పాకిస్థాన్ కంటే మనమే టాప్
మరుసటి రోజు సుందర్‌ని ఎవరో దారుణంగా చంపారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే.. స్థానికులందరూ పరమేశ్వరి వైపు వేలెత్తి చూపడంతో, పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. అప్పుడు ఆమె అసలు విషయం బయటకు పొక్కింది. ఆస్తి విషయంలో గొడవలు రావడం వల్లే.. తన ప్రియుడితో కలిసి సుందర్‌ని అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి, పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు.