BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ప్రేమలు’ దర్శకుడు గిరీష్ AD దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’. మమిత బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కేరళ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఓనమ్ కానుకగా మలయాళంలో విడుదలైన ఈ ఫీల్-గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.నివిన్ పౌలి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
రిలీజ్ అయిన మూడు రోజులలోనే రూ. 60 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంతటి సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సమాయత్తమయ్యారు. ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు హీరో నివిన్ పౌలీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని భావనా స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఫ్యూచర్ రన్-అప్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. ‘ప్రేమలు’ తరహాలోనే ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా తెలుగు ప్రేక్షకుల మనసులను తప్పకుండా గెలుచుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. వాస్తవానికి మొదట తెలుగులో రీమేక్ చేయాలని భావించారు కానీ కథ అందులోని సెన్సబిలిటీస్ ఇక్కడ ఆడియెన్స్ కు అంతాగ సెట్ అవ్వవని భావించి రీమేక్ ఆలోచనను పక్కన పెట్టి డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. మళయాళంలో రికార్డులు క్రియేట్ చేసిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ తెలుగులో ఎలాంటి వసూళ్లు తెస్తుందో చూడాలి.
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!