8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
- సెప్టెంబర్ 1, 2026న POCO F9 Pro, POCO F9 Ultra గ్లోబల్ లాంచ్
- POCO F9 Ultraలో భారీ 8,050mAh బ్యాటరీ
- ఈ ఫోన్లో 200MP మెయిన్ కెమెరా
- 50MP పెరిస్కోప్ కెమెరాతో 5x జూమ్ సపోర్ట్..
- 100W వైర్డ్, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCO F9 Ultra: పోకో (POCO) నుండి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ గ్లోబల్ మార్కెట్లోకి రావడానికి రంగం సిద్ధమైంది. POCO F9 సిరీస్‌లో భాగంగా పోకో F9 ప్రో (POCO F9 Pro), పోకో F9 అల్ట్రా (POCO F9 Ultra) స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్ 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గతేడాది విడుదలైన POCO F8 Pro, F8 Ultraలకు కొనసాగింపుగా ఈ కొత్త మోడళ్లు రానున్నాయి. “UltraPower Unbound” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
ప్రీమియం డిజైన్:
పోకో F9 అల్ట్రాలో డార్క్ చెర్రీ కలర్ ఆప్షన్‌ను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. టెక్చర్డ్ గ్లాస్ ఫైబర్ ఫినిష్‌తో రూపొందించిన ఈ ఫోన్ ప్రీమియం మ్యాట్ లుక్‌ను కలిగి ఉంటుంది. పెద్ద రౌండెడ్ కార్నర్స్‌తో పాటు మెరుగైన గ్రిప్‌ను అందించేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. పోకో F9 ప్రో ను అరోరా గ్రీన్ కలర్లో తీసుకురానున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేకమైన ల్యూమినస్ క్యాసింగ్ను అందించారు. ఇది పరిసరాల్లోని వెలుతురు, సూర్యకాంతిని గ్రహించి.. చీకటి వాతావరణంలో సమానంగా, ఎక్కువసేపు వెలుగును విడుదల చేసేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
Also Read
- iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్:
ఈ రెండు స్మార్ట్ఫోన్లలోనూ కెమెరా మాడ్యూల్‌ను ప్రత్యేకమైన రియర్ కెమెరా ఐలాండ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రత్యేకంగా ‘బోస్’ ట్యూన్ చేసిన సౌండ్ సిస్టమ్‌ను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఆడియో విభాగంలోనూ ఈ ఫోన్లు ప్రత్యేకమైన అనుభూతిని అందించనుంది.

POCO F9 Pro స్పెసిఫికేషన్లు:
ఇందులో 6.59 అంగుళాల 1.5K/QHD+ OLED డిస్ప్లే ఉండనున్నట్లు సమాచారం. ఈ స్క్రీన్ 185Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేయనుంది. కెమెరాల విషయానికి వస్తే.. 50MP మెయిన్ కెమెరాతో పాటు OIS సపోర్ట్, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. అలాగే ఇందులో 6,330mAh బ్యాటరీ ఉండనుంది. దీనికి 100W HyperCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించనుంది. ఇంకా IP68/IP69 రేటింగ్, అల్యూమినియం ఫ్రేమ్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నట్లు అంచనా.

POCO F9 Ultra:
పోకో F9 అల్ట్రా మరింత ప్రీమియం స్పెసిఫికేషన్లతో రానుంది. ఇందులో 6.85 నుంచి 6.9 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. 185Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు సుమారు 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను ఈ స్క్రీన్ అందించనుంది. పనితీరు కోసం Snapdragon 8 Elite Gen 5 లేదా Extreme Edition చిప్‌సెట్‌ను ఉపయోగించనుండగా.. కెమెరా విభాగంలో 50MP లేదా 200MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నాయి. పెరిస్కోప్ కెమెరా 5x జూమ్‌కు సపోర్ట్ చేయనుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉండనుంది. అలాగే ఇది 8,050mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. దీనికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించనుంది. ఈ ఫోన్ కూడా IP68/IP69 రేటింగ్‌తో రానున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 1న గ్లోబల్ లాంచ్
POCO F9 Pro, POCO F9 Ultra గ్లోబల్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 1, 2026న జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. పోకో అధికారిక సోషల్ మీడియా, వీడియో ఛానళ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. లాంచ్ ఈవెంట్లో ఈ రెండు ఫోన్లకు సంబంధించిన పూర్తి ధరలు, ప్రాంతాల వారీగా లభ్యత వివరాలను కంపెనీ వెల్లడించనుంది.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!