43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- Haier Mini LED M70 Seriesలో 43, 55, 65, 75, 85 అంగుళాల మోడళ్లు
- డిస్ప్లే: 4K రిజల్యూషన్, Mini LED/D-LED ప్యానెల్, 60Hz నేటివ్ రిఫ్రెష్ రేట్
- HDR సపోర్ట్: Dolby Vision, HDR10+తో పాటు 93% వరకు DCI-P3 కలర్ గ్యామట్ కవరేజీ...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haier Mini LED M70 Series Tv: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ హైయర్ (Haier) భారత్‌లో కొత్త స్మార్ట్ టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. Haier Mini LED M70 సిరీస్ పేరుతో వచ్చిన ఈ టీవీలు 43, 55, 65, 75, 85 అంగుళాల స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. మినీ LED టెక్నాలజీ, 4K రిజల్యూషన్, గూగుల్ టీవీ, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో పాటు AI ఆధారిత పిక్చర్ క్వాలిటీ ఫీచర్లను ఇందులో అందించారు.
ఈ సిరీస్ టీవీల్లో మినీ LED, D-LED ప్యానెల్‌ను ఉపయోగించారు. ఇవి 3840×2160 పిక్సెల్స్ 4K రిజల్యూషన్, 16:9 యాస్పెక్ట్ రేషియో, 178°/178° వ్యూయింగ్ యాంగిల్‌తో వస్తాయి. డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. టీవీల్లో “మైక్రో డిమ్మింగ్” టెక్నాలజీని అందించారు. ఇది స్క్రీన్‌ను అనేక ప్రాంతాలుగా విభజించి ఆయా సన్నివేశాల్లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్‌ను డైనమిక్‌గా సర్దుబాటు చేస్తుంది. దీంతో ప్రకాశవంతమైన, చీకటి ప్రాంతాల్లో మరింత మెరుగైన వివరాలు కనిపించేలా చేస్తుంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
AI పిక్చర్ క్వాలిటీ ఇంజిన్ రియల్‌టైమ్‌లో కంటెంట్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఇందులో AI HDR Enhancer, AI కలర్ బూస్ట్, AI మోషన్, AI నాయిస్ రెడ్యూకేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి HDR కంటెంట్‌లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్‌ను మెరుగుపరచడంతో పాటు కలర్ రీప్రొడక్షన్, ఫాస్ట్ మూవింగ్ సీన్ల క్లారిటీని పెంచుతాయి. ఈ టీవీలు డాల్బీ విజన్, HDR10+కు సపోర్ట్ చేస్తాయి. అలాగే 93% వరకు DCI-P3 కలర్ గ్యామట్ కవరేజీని అందిస్తాయి. HDR టెక్నాలజీలు ఒక్కో సన్నివేశంలోని బ్రైట్, డార్క్ ప్రాంతాలను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడతాయి. అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ సిరీస్‌లో 60Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ ఉంది. MEMC టెక్నాలజీ అదనపు ఫ్రేమ్‌లను రూపొందించడం ద్వారా మూవింగ్ కంటెంట్‌ను మరింత స్మూత్‌గా చూపిస్తుంది.
గేమింగ్‌ను ఇష్టపడే వారి కోసం M70 సిరీస్‌లో Gaming 120Hz (DLG), VRR, ALLM వంటి ఫీచర్లను అందించారు. VRR గేమ్ ఫ్రేమ్‌రేట్‌కు అనుగుణంగా డిస్ప్లే రిఫ్రెష్ రేట్‌ను సింక్రనైజ్ చేస్తుంది. ALLM అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా తక్కువ లేటెన్సీ మోడ్‌ను యాక్టివేట్ చేస్తుంది. వీటితోపాటు గేమింగ్ బార్, షాడో ఎన్హాన్సమెంట్, క్రాస్ హెయిర్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్ బార్ ద్వారా రిఫ్రెష్ రేట్, గేమింగ్ మోడ్, డిస్ప్లే సెట్టింగ్స్ వంటి వివరాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
ఆడియో విషయానికి వస్తే.. 55, 65, 75, 85 ఇంచ్ మోడళ్లలో 50W 2.1-ఛానల్ సౌండ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ సబ్‌వూఫర్‌ను అందించారు. 43 ఇంచ్ మోడల్లో 30W ఆడియో అవుట్‌పుట్ ఉంటుంది. ఈ టీవీలు డాల్బీ ఆటమ్స్, DBX-టీవీ, టోటల్ సోనిక్స్ వంటి ఆడియో టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తాయి. ప్రొఫెషనల్ ఆడియో ట్యూనింగ్ ద్వారా సౌండ్ ఫిడెలిటీ, ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్, డైలాగ్ క్లారిటీని మెరుగుపరిచినట్లు కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫీచర్ల కోసం గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో 2GB RAM, 32GB స్టోరేజ్ ఉన్నాయి.
Haier M70 Seriesలో HaiCast ద్వారా అనుకూలమైన స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్‌ల నుంచి స్క్రీన్ మిర్రరింగ్ చేయవచ్చు. బ్లూటూత్ స్పీకర్ మోడ్ ద్వారా టీవీ డిస్ప్లేను ఆఫ్ చేసి మ్యూజిక్‌ను స్పీకర్ల ద్వారా వినే అవకాశం ఉంది. అలాగే TÜV Rheinland సర్టిఫైడ్ “లో బ్లూ లైట్” టెక్నాలజీని అందించారు. ఇది కలర్ అక్యూరసీ, పిక్చర్ క్వాలిటీని కొనసాగిస్తూనే బ్లూ లైట్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కనెక్టివిటీ కోసం నాలుగు HDMI పోర్టులు, HDMI 2.1 eARC, రెండు USB 2.0 పోర్టులు, Ethernet LAN, బ్లూటూత్ 5.1 వంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఈ సిరీస్ టీవీలు భారత్‌లో నుంచి ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి. Haier M70 Seriesలో 43, 55, 65, 75 ఇంచ్ మోడళ్లకు 3 ఏళ్ల వారంటీ అందిస్తున్నారు. 85 ఇంచ్ మోడల్‌కు 4 ఏళ్ల వారంటీ లభిస్తుంది. భారత్‌లో Haier Mini LED M70 Series టీవీల ధరలు ఇలా ఉన్నాయి:
* 43 ఇంచ్: రూ.39,190
* 55 ఇంచ్: రూ.56,590
* 65 ఇంచ్: రూ.74,990
* 75 ఇంచ్: రూ.1,02,990
* 85 ఇంచ్: రూ.1,69,990
มากกว่าความคมชัด คือ "จุดกำเนิดของสีที่แท้จริง" 🎨🔥
เปิดมุมมองใหม่ให้ทุกการรับชมกับ Hisense RGB MiniLED นวัตกรรมทีวีที่ได้รับแรงบันดาลใจจากการหักเหของแสงธรรมชาติ
🌈The Origin of Light: ถอดรหัสความลับของแสง เพื่อสีสันที่เป็นธรรมชาติที่สุด
☄️Beyond Limits: เมื่อแม่สี RGB… pic.twitter.com/qhhNKwBbNS— Hisensethailand (@HisenseThailand) August 24, 2026
.
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!