Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumbudi Collections: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినాను చూపిస్తోంది. చాలా సంవత్సరాలుగా దోబూచులాడిన బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో అందుకున్నారు రవితేజ. వీకెండ్ ఓపెనింగ్ లో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా సోమవారం కూడా అదే జోరును కొనసాగిస్తూ 100కోట్ల మార్కును అవలీలగా దాటేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ తెలుగు రాష్ట్రాల్లో రవితేజ కెరీర్లోనే కాకుండా రీజినల్ సినిమాల బాక్సాఫీస్ పరంగా కూడా ప్రత్యేకమైన రన్‌ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డే 4 కలెక్షన్ల విషయంలో ఈ భారీ రికార్డును నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో ‘బాహుబలి 2’ మాత్రమే ‘ఇరుముడి’ కంటే ముందుండటం విశేషంగా మారింది. దీంతో నాలుగో రోజు కూడా సినిమా ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ మూవీ నాలుగు రోజుల్లోనే వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. వీకెండ్ ఓపెనింగ్ తర్వాత కలెక్షన్లు నిలకడగా కొనసాగడం వల్లే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కారణంగా వీక్డేస్లోనూ థియేటర్లలో ఆక్యుపెన్సీ బలంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ బుకింగ్స్‌ను పరిశీలిస్తే సినిమాపై ఉన్న క్రేజ్ మరింత స్పష్టమవుతోంది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి ఇప్పటికే 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. కేవలం మొదటి రెండు మూడు రోజులకు మాత్రమే పరిమితమైన హైప్ కాకుండా, సినిమా రన్ కొనసాగుతున్న కొద్దీ టికెట్ డిమాండ్ కూడా నిలకడగా ఉండటం ఇప్పుడు చిత్ర బృందానికి పెద్ద ప్లస్‌గా మారింది. కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల డిమాండ్‌కు అనుగుణంగా థియేటర్ల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
- Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
మరోవైపు డే 5 అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పాజిటివ్‌గా ఉండటం ‘ఇరుముడి’కు మరో ప్లస్ గా మారింది. సాధారణంగా సోమవారం తర్వాత సినిమాల కలెక్షన్లలో స్పష్టమైన డ్రాప్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నాలుగో రోజు కూడా భారీ స్థాయి వసూళ్లు రావడం, ఐదో రోజుకు ముందస్తు బుకింగ్స్ బలంగా ఉండటం సినిమా బాక్సాఫీస్ రన్‌పై ఆశలు పెంచుతోంది. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ‘ఇరుముడి’ మరిన్ని బాక్సాఫీస్ మైలురాళ్లను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి నాలుగు రోజుల్లోనే ప్రవేశిస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఫుల్ రన్లో ఎక్కడి వరకు వెళ్తుంది, రవితేజ కెరీర్లో ఎలాంటి కొత్త రికార్డులను నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ‘ఇరుముడి’ విజయోత్సాహం రవితేజ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ జోరుగా కొనసాగుతోంది. అయితే ‘టాక్సిక్’ ప్రభావం ఈ సినిమాపై పడుతుందనే చర్చ కూడా మొదలవుతోంది. మరి రేపు రిలీజ్ కానున్న ‘టాక్సిక్’ ను తట్టుకుని ఈమూవీ ఇదే తరహా కలెక్షన్స్ కొనసాగిస్తే 200 కోట్ల మార్క్ ను దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?