AAA Cinimas: ఎట్టకేలకు అల్లు అర్జున్.. థియేటర్ రంగంలోకి అడుగుపెట్టేశాడు. నేడు అల్లు అర్జున్ మల్టిఫ్లెక్స్ పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. అత్యాధునిక నిర్మాణం, టెక్నాలజీతో ఈ థియేటర్ ను నిర్మించారు. ముఖ్యంగా.. అల్లు అర్జున్ తన టేస్ట్ కు తగ్గట్లు బ్రాండ్ కు తగ్గట్లు నిర్మించుకున్నాడు. మాల్ మొత్తాన్ని తన సినిమా పోస్టర్స్ తో అవార్డులతో నింపేశాడు. తనకు వచ్చిన అవార్డులను అభిమానులు చూసేలా సందర్శనార్థం పెట్టించాడు. తన మొదటి సినిమా నుంచి పుష్ప 2 వరకు ఆయన నటించిన ప్రతి సినిమా పోస్టర్ బాక్స్ లను ఒకపక్క.. తన ఫ్యామిలీ ఫోటోలను ఇంకోపక్క పెట్టుకొచ్చాడు. ఇక జూన్ 16 నుంచి ఈ మల్టిఫ్లెక్స్ లో స్క్రీనింగ్ మొదలుకానుంది. ఈ థియేటర్ లో మొత్తం 5 స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో మొట్ట మొదటి సినిమాలుగా ఏవి స్క్రీనింగ్ చేస్తున్నారంటే.. మొదటి స్క్రీన్ లో ఆదిపురుష్ ఉంది.
Nandamuri Bhargav Ram : హ్యాపీ బర్త్ డే చిన్నోడా.. తండ్రి అంతటోడివి కావాలే
ప్రభాస్ రాముడిగా నటించిన ఈ చిత్రం జూన్ 16 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. ఈ మల్టిఫ్లెక్స్ లో ఆదిపురుష్.. స్క్రీనింగ్ కు బుక్ మై షో లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా రెండో స్క్రీనింగ్ లో హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్(Across The Spider-Verse) స్క్రీనింగ్ కానుంది. జూన్ 2 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ముచ్చటగా మూడో స్క్రీన్ లో ట్రాన్స్ ఫార్మర్స్ స్క్రీనింగ్ కానుంది. ఇంకో రెండు స్క్రీన్స్ లో మరి రెండు సినిమాలను స్క్రీనింగ్ చేయనున్నారట. ఈ మూడు సినిమాలకు సంబంధించిన టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. ఓ అసలు ఇదెక్కడ ఉందో చెప్పనేలేదు కదా.. అమీర్ పేట్ లో AAA Cinimas అనే పేరుతో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. జూన్ 16 న బన్నీ థియేటర్ కు వెళ్లి.. అక్కడ కొత్త ఎక్స్ పీరియన్స్ ను ఎంజాయ్ చేయాలంటే.. ఛలో అల్లు అర్జున్ మల్టిఫ్లెక్స్.