ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ చేసిన హంగామాకు సినిమా పై ఎక్కడా లేని హైప్ రాగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని ఆకాశన్నంటేలా చేసింది. ఇంతటి భారీ అంచనాల మధ్య రాజాసాబ్ రిలీజ్ అవుతోంది.
Also Read : Sankranthi Release : సంక్రాంతికి రావాల్సిన స్టార్ హీరో సినిమా వాయిదా?
పాన్ ఇండియా వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్, భారీ బడ్జెట్, భారీ హైప్ తో రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ కు నైజాంలో థియేటర్స్ విషయంలో చాలా అన్యాయం జరుగోతోందనే టాక్ ఫ్యాన్స్ నుండి వినిపిస్తోంది. హైదరాబాద్ లోని మొత్తం సింగిల్ స్క్రీన్స్ లో కేవలం 22 సింగిల్ స్క్రీన్స్ ను మాత్రమే రాజాసాబ్ కు కేటాయించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 75, 35 MM లు మాత్రమే కేటాయించారు. అయితే తెలుగు సినిమా అయిన భగవంత్ కేసరిని తమిళ్ లో రీమేక్ చేసి దాన్ని మళ్ళి తెలుగులోకి డబ్ చేస్తున్న జననాయకుడు సినిమాకు మాత్రం నైజాంలో మంచి స్క్రీన్స్ కు కేటాయించారు. మల్టిప్లెక్స్ లో అయితే విజయ్ సినిమాకు తెలుగు సినిమాల కంటే ఎక్కువగా కేటాయించారు. ఈ విషయంలో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రవితేజ, శర్వానంద్ సినిమాలకు కూడా చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు.