శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్‌గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్
అయితే ఈ సినిమాను మొదట తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించారు. టీజర్, సాంగ్స్ కూడా తెలుగులో రిలీజ్ చేశారు. అమరన్ హిట్ తర్వాత వస్తున్న శివకార్తికేయన్ సినిమా కావడంతో తెలుగులోను ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల పడే అవకాశం కనిపిస్తోంది. తెలుగులో మన శంకరవరప్రసాద్, రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్స్ లో ఈ సినిమాలకు కేటాయించబోతున్నారు. దానికి తోడు విజయ్ జననాయగాన్ ను తెలుగులో PVRINOX రిలీజ్ చేస్తుంది. సో మల్టీప్లెక్స్ లో ఎక్కువ షోస్ విజయ్ సినిమాకు వెళ్తున్నాయి. దాంతో అటు సింగిల్ స్క్రీన్స్, ఇటు మల్టిప్లెక్స్ లో పరాశక్తికి థియేటర్స్ దొరకడంలేదు. ఈ కారణాంగా తమిళ వెర్షన్‌ను జనవరి 10న విడుదల చేసిన తర్వాత తెలుగు వెర్షన్‌ను జనవరి 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో తన సినిమాలకు తెలుగులో ప్రమోషన్స్ చేసిన హీరో కార్తికేయన్ పరాశక్తి విషయంలో టాలీవుడ్ కు దూరంగానే ఉంటున్నాడు. పరిస్థితి చూస్తుంటే పరాశక్తి తెలుగు రిలీజ్ దాదాపు లేనట్టేనని తెలుస్తోంది.