Yellamma : నితిన్ కెరీర్ లో క్రేజీ ప్రాజెక్టుగా రాబోతున్న మూవీ ఎల్లమ్మ. బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి నుంచి ఈ ప్రాజెక్టు వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బలగం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు వేణు. ఎల్లమ్మ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అందులో నితిన్ హీరో అని కన్ఫర్మ్ చేశారు. కానీ హీరోయిన్ ను మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సాయిపల్లవి పేరు మొన్నటి దాకా బాగా వినిపించింది. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని.. సాయిపల్లివి అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని మొన్నటి దాకా వార్తలు వినిపించాయి.
Srisailam Temple: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష
కానీ చివరి నిముషంలో సాయిపల్లవి హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ కథను కీర్తి సురేష్ కు వినిపించాడంట వేణు. ప్రస్తుతం ఆమె పాత్రపై చర్చలు జరుగుతున్నాయని.. దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టే తెలుస్తోంది. కీర్తి సురేష్ కూడా యాక్టింగ్ పరంగా ఇరగదీస్తుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంది. కాబట్టి ఈ పాత్రకు ఆమె కరెక్టుగా ఉంటుందని భావిస్తున్నారంట. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.