బ్యూటీ విత్ బ్రెయినే కాదు కాస్తంత లక్ కూడా ఉండాలి హీరోయిన్లకు. అప్పుడే కెరీర్ పీక్స్‌కు వెళుతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ క్యాథరిన్ థెరిస్సాకు రావాల్సినంత ఐడెంటిటీ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో జతకట్టినప్పటికీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్స్ రోల్స్‌కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది కాథరిన్. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార తప్పా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు.
Also Read : Karthi : సర్దార్ 2 నుండి యువన్ శంకర్ రాజా ఔట్
బింబిసార తర్వాత కేథరిన్ చేసిన మాచర్ల నియోజకవర్గం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. నెక్ట్స్ వచ్చిన వాల్తేరు వీరయ్యలో రవితేజ భార్యగా గెస్ట్ అప్పీరియన్స్ పాత్రకే పరిమితమైంది. పేరుకు పెద్ద సినిమాలే చేసింది కానీ ఆమెకు క్రెడిట్ దక్కలేదు. దీంతో ఏడాది గ్యాప్ తీసేసుకున్న క్యాథరిన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటయ్యింది. దూకుడు పెంచుతోంది. కోలీవుడ్, టాలీవుడ్‌లో టూ ఫిల్మ్స్‌కు కమిటయ్యింది. సి సుందర్, వడివేలు కీ రోల్ ప్లే చేస్తోన్న గ్యాంగర్స్ మూవీ చేస్తోంది క్యాథరిన్. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేయగా చాలా రోజుల తర్వాత వడివేలు పుల్ లెంత్ హిలేరియస్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బొమ్మ. అలాగే తెలుగులో ఫణి అనే మూవీ చేస్తోంది ఈ చబ్బీ బ్యూటీ. మనసంతా నువ్వే ఫేం విఎన్ ఆదిత్య దర్శకుడు. పాన్ ఇండియా బొమ్మగా రాబోతుంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఇప్పటికే కోల్పోయిన ఫేమ్ ఈ మూవీలతో తెచ్చుకుంటుందని ఆశిద్దాం.