2022లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సర్దార్‌కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ ఎనౌన్స్ చేసిన కంపోజర్ యువన్ శంకర్ రాజాను తప్పించారన్న వార్తలు రాగా, ఇప్పుడు కన్ఫర్మేషన్ అయ్యింది. యువన్ ప్లేసులోకి రీప్లేస్ అయ్యాడు నయా సెన్సేషనల్ కంపోజర్ సామ్ సీఎస్. ఫస్ట్ యువన్‌ను తీసుకుని.. ఇప్పడు గుడ్ బై చెప్పడానికి వెనుక పలు రీజన్స్ ఉన్నాయన్నది కోలీవుడ్‌లో గుసగుసలువినిపిస్తున్నాయి. సర్దార్‌కు ఫస్ట్ ఛాయిస్ యువన్ శంకర్ రాజానే.
Also Read : Exclusive : పాన్ ఇండియా మూవీలో గెస్ట్ రోల్.. రిజెక్ట్ చేసిన బాలయ్య
కానీ జీవీ ప్రకాష్ ఆ ఛాన్స్ కొల్లగొట్టాడు. అప్పుడు సెట్ కాకపోవడంతో సర్దార్ 2కు పిలిచి ఆఫర్ చేశాడు డైరెక్టర్ మిత్రన్. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నాడు యువన్. తన కమిట్మెంట్స్, వర్క్ డిఫరెన్సెస్ వల్ల ఆన్ టైంలో సినిమాకు స్కోర్ ఇవ్వలేకపోతున్నాడట. దీంతో ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసేసినట్లు టాక్. సర్దార్ 2కు యువన్ శంకర్ రాజా ప్లేసులోకి సామ్ సీఎస్ వచ్చి చేరాడు. రీసెంట్లీ పుష్ప2కు అడిషనల్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకున్న సామ్.. గతంలో కార్తీ మూవీకి వర్క్ చేశాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఖైదీ.. సినిమాను నిలబెట్టడంలో కీ రోల్ పోషించింది. అందుకే సర్దార్ 2కు బెస్ట్ ఛాయిస్ సామే అని మిత్రన్ నమ్మడంతో అతడ్నే టీంలోకి తీసుకున్నారు. అలాగే ఖైదీ2 కూడా కంపోజింగ్ ఛాన్స్ కూడా ఈ యంగ్ టాలెంట్‌కే దక్కినట్లు తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ కార్తీ ఛాన్సులు కొల్లగొట్టిన సామ్ సీఎస్ మరీ సర్దార్ 2 టీం హోప్స్‌ను నిలబెడతాడో లేదో చూడాలి.