అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమా ఇండియాలో సెన్సేషనల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. వివాదాలు అడ్డొచ్చినా, రాష్ట్రాలకి రాష్ట్రాలే సినిమాని బాన్ చేసినా కలెక్షన్స్ మాత్రం పీక్ స్టేజ్ లో ఉన్నాయి. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకూ డ్రాప్ కనిపించలేదు. డే 1 కన్నా డే 7 ఎక్కవ కలెక్షన్స్ ని రాబట్టింది అంటే ది కేరళ స్టొరీ సినిమా ఏ రేంజ్ లో బుకింగ్స్ ని రాబడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రాపగెండానా లేదా ఇంకోకటా అనేది పక్కన పెడితే ఒక లేడీ ఓరియెంటెడ్ చిన్న సినిమా, కేవలం 16 కోట్ల బడ్జట్ తోనే రూపొందిన సినిమా… ఈరోజు వారం తిరిగే లోపు 82 కోట్లని రాబట్టడం గొప్ప విషయమే.
Read Also: Adipurush: మరో కొత్త వివాదంలో ‘ఆదిపురుష్’! ఈ కర్ణుడి కష్టాలేంటో?
ఈరోజు నుంచి వీకెండ్ మొదలవుతుంది కాబట్టి మండేకి ది కేరళ స్టొరీ సినిమా 100 కోట్ల మార్క్ ని చేరుకోవడం గ్యారెంటీ. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ ఓవరాల్ థియేట్రికల్ రన్ లో 250 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ, వేస్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ది కేరళ స్టొరీ సినిమాని ఎంతగా ప్రభుత్వాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయో మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ది కేరళ స్టొరీ సినిమాకి అంతే అండగా నిలుస్తున్నాయి. టాక్స్ ఫ్రీ చేసి మరీ ది కేరళ స్టొరీ సినిమాని చూడమని ప్రమోట్ చేస్తున్నాయి. ఇక అదా శర్మ విషయానికి వస్తే ఆల్మోస్ట్ కెరీర్ అయిపొయింది, ఇక సినిమా రావు అనుకునే టైంలో ది కేరళ స్టొరీ మూవీ అదా శర్మ కెరీర్ ని టర్న్ చేసింది. హ్యూజ్ టర్నింగ్ పాయింట్ అయిన ఈ మూవీ దెబ్బకి అదా శర్మకి మళ్లీ సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి.