రాను రాను టాలీవుడ్ సినిమా నిర్మాణం మరింత భారం అయ్యేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒక వైపు సినిమాలు డిజాస్టర్లు అవుతున్న కూడా హీరోలు మాత్రం కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటూ నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇక నిర్మాణం సంగతి సరే సరి. మొదటి సినిమాతో ఓ మాదిరి హిట్ కొట్టున దర్శకుడు రెండవ సినిమాకు అడిగిన బడ్జెట్ చూసి నోరెళ్లబెట్టాడు ఓ నిర్మాత. సరే అన్నిటికి ఓకే అని నిర్మాత ముందు వచ్చి సినిమా చేసాక.. చివరికు ఆయనకు మిగిలేది ఏందయ్యా అంటే అప్పు తెచ్చిన డబ్బులుకి వడ్డీలు కట్టడానికి మరోసారి అప్పు చేయడమే.
ఇటీవల టాలీవుడ్ లో మరో సంస్కృతి మొదలైంది. అదే పోస్టర్ పిచ్చి.. సినిమా డిజాస్టర్ అయిన సరే మొదటి రోజు మాత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పోస్టర్ పడాలి.. లేదంటే ఫ్యాన్స్ నుండి వచ్చే ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. గతేదాడి రిలీజ్ అయిన ఓ భారీ సినిమా వందల కోట్ల పోస్టర్స్ వదిలారు. కానీ ఆంధ్రలోని కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కానీ పరిస్థితి. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన పాన్ ఇండియా సినిమా పరిస్థితి ఘోరం. మొదటి రోజు బెనిఫిట్ షో కూడా ఫుల్ కానీ పరిస్థితి అయినా సరే మొదటి రోజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పోస్టర్ రిలీజ్ చేసి నవ్వులపాలు అయ్యారు. ఇక మరోక మిడ్ రేంజ్ హీరో సినిమా పరిస్థితి కూడా అటు ఇటుగా ఇదే. కానీ బయకు చెప్పుకోలేని సిచ్యుయేషన్. కానీ హీరోల మెప్పుకోసం వందల కోట్ల రూపాయల పోస్టర్ లు రోజుకొకటి వస్తాయి. వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ కొట్టిన ఓ హీరో ఇప్పటికి తన రెమ్యునరేషన్ ను ముప్పై కోట్లకు పైగానే తీసుకుంటున్నాడు. ఇక సీనియర్ హీరో సంగతి అయితే చెప్పక్కర్లేదు. వందకోట్లకు కాస్త దగ్గరగా లేనిది ఆయన సినిమా చేయరు. ఇంతాఇచ్చి సదరు హీరోలు భారీ కలెక్షన్స్ రాబడతారా అంటే మెుదటివారమే థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కానీ పోస్టర్స్ మాత్రం వంద కోట్లు దాటేస్తున్నాయి. దీంతో నిర్మాతలకు వచ్చే దానికంటే పోయే లెక్క ఎక్కవగా ఉంది.