మాస్టర్ సినిమాతో సాలిడ్ హిట్ కొడతారు అనుకున్న హీరో దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కానగరాజ్… సినీ అభిమానులందరికి షాక్ ఇస్తూ హ్యూజ్లీ డిజప్పాయింట్ చేసారు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా హీరో విజయ్ క్యారెక్టర్ కి లేకపోవడం, లోకేష్ కానగరాజ్ నుంచి ఖైదీ లాంటి మాస్టర్ పీస్ ని ఎక్స్పెక్ట్ చేయడం ‘మాస్టర్’ సినిమా రిజల్ట్ కి కారణం అయ్యింది. ఈ మూవీ తర్వాత విజయ్ మళ్లీ లోకేష్ కి సినిమా ఇవ్వడమో అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయ్యి ‘లియో’ సినిమా ఆన్ అయ్యింది. ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ ఒకవేళ LCUలో భాగం అయితే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ.
ఈ విషయంలో లోకేష్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు కానీ లియో షూటింగ్ పార్ట్ ని మాత్రం క్లోజ్ చేసారు. విజయ్ పోర్షన్స్ ని కంప్లీట్ చేసిన లోకేష్ కానగరాజ్, ప్యాచ్ వర్క్ చేస్తున్నాడు. విజయ్ పార్ట్ వరకూ షూటింగ్ కంప్లీట్ అయ్యింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. దీపావళికి లియో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసారు కాబట్టి ఆ టార్గెట్ ని పెట్టుకోని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. మాస్టర్ తో మిస్ అయిన హిట్ టార్గెట్ ని ఈసారి సాలిడ్ గా కొట్టాలని లోకేష్ ప్లాన్ చేసాడు. అనిరుద్ మ్యూజిక్ కూడా సూపర్బ్ గా ఇచ్చాడు. నా రెడీ సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యి టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ పాట లియో ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చింది. ఇదే జోష్ ని ప్రమోషన్స్ లో మైంటైన్ చేస్తే విజయ్ కెరీర్ కే కాదు కోలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా ‘లియో’ నిలవడం గ్యారెంటీ.