Thalapathy 67: వరిసు సినిమాతో మరో హిట్ అందుకున్నాడు విజయ్. తెలుగులో ఒక మోస్తరుగా ఆడిన ఈ సినిమా తమిళ్ లో మాత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విజయంతో జోరు పెంచేసిన విజయ్.. మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు. మాస్టర్ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తో మరో సినిమాను రీపీట్ చేయనున్నాడు. ఇక ఈ విషయం ముందు నుంచి అందరికి తెల్సిందే.. కానీ, అధికారికంగా రాకపోయేసరికి అభిమానులు కొద్దిగా అనుమానం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు.
విక్రమ్ హిట్ తో లోకేష్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగిపోయింది. ఈ సినిమా తరువాత అతడికి పెద్ద పెద్ద స్టార్ హీరోలు తమతో సినిమా చేయమని అడిగిన విషయం కూడా తెల్సిందే. అయితే.. లోకేష్ మాత్రం విజయ్ తోనే ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ విషయాన్నీ లోకేష్ అభిమానులతో పంచుకుంటూ విజయ్ తో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇది కూడా పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ఇప్పుడే భారీ అంచనాలను పెట్టేసుకున్నారు అభిమానులు. ఇందులో విజయ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తోంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.