Thalaivar170: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెల్సిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా దాదాపు రూ. 600 కోట్లకు పైగా సాధించింది. ఇక ఈ చిత్రంలో రజినీనే ఒక స్టార్ అనుకుంటే.. సినిమా మొత్తం స్టార్ లతో నింపేశాడు నెల్సన్. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివన్న కాకుండా.. ఇక అనిరుధ్ రవిచంద్రన్ ఈ స్టార్ లందరికీ పెద్ద స్టార్. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. అనిరుధ్ మ్యూజిక్ మరో ఎత్తు అని చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత రజినీ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. జైలర్ తరువాత రజినీ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. అందులో ఒకటి .. జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తలైవర్ 170. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
NTR: ఎన్టీఆర్ తో బ్రహ్మాస్త్ర డైరెక్టర్ భేటీ .. వార్ 2 మొదలు..?
ఇక ఈ సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి తలైవర్ 170 పైన మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే టీజే జ్ఞానవేల్ సైతం ఈ చిత్రాన్ని మరింత హై లెవెల్లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు. అందుకే కథకు తగ్గట్టుగానే స్టార్ క్యాస్టింగ్ ను దింపుతున్నాడు. ఉదయం నుంచి ఈ సినిమా నుంచి ఒక్కో ఆర్టిస్ట్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వస్తున్నారు. ఇక అందులో అందరూ కూడా స్టార్ హీరోయిన్స్ ఉండడం విశేషం. కన్నడ నటి దుషారా విజయన్, మలయాళ నటి మంజు వారియర్, మరో కుర్ర హీరోయిన్ రితికా సింగ్ కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ఇక దీంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ను కూడా అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించారు. ఇక దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ క్యాస్టింగ్ చూసిన అభిమానులు నువ్వు కూడా నెల్సన్ లా స్టార్స్ ను దింపు.. అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో రజినీ జైలర్ లాంటి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.