Bro Movie Ticekt rates: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రో’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ బ్రో సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్, బ్రో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Project K: ప్రాజెక్ట్ k ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే..
ఈ క్రమంలో ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఏర్పడుతున్న సినిమా టికెట్ రేట్ల అంశం గురించి ఆయనని అడిగితే ఆయన ఆసక్తికరంగా స్పందించారు. బడ్జెట్ పరిమితి దాటిందా? టికెట్ రేట్లు పెంచే ఆలోచన ఉందా? అని ఆయనని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానికి అనుకున్న బడ్జెట్ లో మేము సినిమాని పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. అదే విధంగా బిజినెస్ పట్ల కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నామని పేర్కొన్న ఆయన అందుకే ఈ సినిమా కోసం. టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని అన్నారు. టికెట్ ధరలు పెంచాలని మేము రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరలేదని ఇప్పుడున్న ధరలతోనే విడుదల చేయాలి అనుకుంటున్నామని అన్నారు. దీంతో పవన్ ఫాన్స్ సహా కామన్ ఆడియన్స్ సైతం బ్రో సినిమాకి టికెట్ల టెన్షన్ లేకుండా మొత్తానికి భలే సెట్ చేశారు ‘బ్రో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.