Telugu Heros at Anant Ambani Wedding: గత కొన్నాళ్లుగా ముఖేష్ అంబానీ ఇంట్లో పెండ్లి వేడుకలు ముంబైలో ఘనంగా జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు. ముఖ్యంగా పలు దేశాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. అంబానీల ఇంట వివాహ వేడుకకి బాలీవుడ్ నుంచి మాత్రమే కాక సౌత్ సహా హాలీవుడ్ నుంచి కూడా అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.
Raj Tarun Case: తిండి లేక ఇబ్బంది పడుతున్నా.. తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్.. లావణ్య కీలక వ్యాఖ్యలు
అంబానీల పెళ్లిలో తెలుగు హీరోల గురించి మాట్లాడాలి అంటే మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు రాంచరణ్, రానా దగ్గుబాటి తమ భార్యలతో హాజరయ్యారు. అలాగే ఫ్యామిలీతో రాకుండా విక్టరీ వెంకటేష్ కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కనిపించారు. అలాగే అక్కినేని అఖిల్, రష్మిక మందన్న సహా మరికొందరు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.