Teja Sajja: వాళ్ళు మా వెనుక ఉన్నారు కాబట్టే.. మేము ఇక్కడ ఉన్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teja Sajja: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయంతో పాటు భారీ కలక్షన్స్ రాబడుతుంది. తాజాగా ఈ చిత్రం 17 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.250 కోట్ల మార్కును అందుకుంది. ఇక రానున్న రెండు రోజులు వీకెండ్ రావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాటిట్యూడ్ మీట్ ని నిర్వహించింది.
ఇక ఈ గ్రాటిట్యూడ్ మీట్ లో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. “ముందుగా మా మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి అభినందనలు. ఈ సినిమా కోసం టీం అంతా సమిష్టిగా కృషి చేశారు. డీవోపీ, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్ మెంట్, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్.. ఇలా అన్నీ విభాగాలు చాలా కష్టపడి అద్భుతమైన ఒట పుట్ ఇచ్చారు. వరలక్ష్మీ గారు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. అమృత చాలా చాలా అద్భుతంగా తన పాత్రని చేశారు. గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ ఇలా నటీనటులంతా చక్కని అభినయం కనపరిచారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి విభాగానికి పేరుపేరునా ధన్యవాదాలు. నిర్మాత నిరంజన్ గారు ఈ సినిమా వెనుక కొండంత అండగా నిలబడ్డారు. మమ్మల్ని బలంగా నమ్మారు. సినిమాని ఇంత అద్భుతంగా విడుదల చేసిన పంపిణీదారులందరికీ ధన్యవాదాలు. హను-మాన్ ని క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మకి ధన్యవాదాలు. ప్రేక్షకులు మా వెనుక నిలబడ్డారు కాబట్టే మేము ఈ రోజు ఈ వేదికపై వున్నాం. సినిమాని అద్భుతంగా ప్రోత్సహించిన ప్రేక్షకులకు పాధాబివందనం. ఇకపై చేసే చిత్రాలు కూడా ఇంతే కష్టపడి ప్రేక్షకులకు నచ్చేలా చేస్తాం. హనుమాన్ అనే సినిమా అద్భుతం. ఆ అద్భుతంగా జరిగిపోయింది. అందరికీ పేరుపేరున ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!