Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మారుతి అనగానే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గుర్తొచ్చేది ఆయన మార్క్ ‘హిలేరియస్ మైండ్ బ్లాకింగ్ కాన్సెప్ట్‌లు’. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి చిత్రాలతో విలక్షణమైన కాన్సెప్ట్‌లతో కంటిన్యూయస్‌గా నవ్వులు పూయించి బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న మారుతి.. ఇటీవల ప్రభాస్ తో రాజాసాబ్ తీసి నిరాశపరిచారు. ఈ సినిమాతో మారుతిపై ట్రోల్స్ కూడా వచ్చాయి. రాజాసాబ్ తర్వాత మారుతి తన తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చ కూడా సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ ఫిలింనగర్ కారిడార్లలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ మారుతీ నెక్ట్స్ ప్రాజెక్టు గురించి హాట్ టాపిక్ గా మారింది. పాన్-ఇండియా స్టార్‌తో రూ. వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేసిన వెంటనే.. మారుతి మళ్లీ తన ‘హోం గ్రౌండ్’ కి తిరిగొస్తూ పూర్తిగా కొత్తవాళ్లతో ఒక చిన్న బడ్జెట్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధపడడమే!. భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ చిత్రాల తరహాలోనే ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈసారి ఎలాంటి స్టార్ ఇమేజ్ భారం లేకుండా, పూర్తిగా కొత్తవాళ్లతో తన ఓరిజినల్ మేకింగ్ స్టైల్లో ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను రూపుదిద్దబోతున్నారు. నవంబరులోనే ఈ చిత్ర షూటింగ్‌ను పట్టాలెక్కించి, వచ్చే మార్చి నాటికి అన్ని పనులూ పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేయాలనే మైండ్ బ్లాకింగ్ డెడ్‌లైన్‌తో మారుతి టీమ్ ప్లాన్ చేస్తోంది. పెద్ద హీరోల ప్రాజెక్టులతో బిజీ అయిన దర్శకులు సాధారణంగా మళ్లీ చిన్న సినిమాల వైపు రారు. కానీ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ అయిన ‘కామెడీ అండ్ కంటెంట్’ వైపు మళ్లీ మొగ్గు చూపడం సినీ ప్రియులకు పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. ‘రాజాసాబ్’ వంటి బిగ్గెస్ట్ మాస్ విజువల్ వండర్ తర్వాత మారుతి తీసుకున్న ఈ ‘హోం గ్రౌండ్’ డెసిషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!
Also Read
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!