హాలీవుడ్ సినిమాల్ని రిలీజ్ చేయడానికి ముందు, కొన్ని ప్రధాన నగరాల్లో ప్రివ్యూస్ వేస్తారు. పది లేదా నెల రోజుల వ్యవధిలో ప్రివ్యూ షోస్ వేయడం జరుగుతుంది. తమ సినిమాలకు మరింత బజ్ తెచ్చుకునేందుకే ఈ స్ట్రాటజీ. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తన ‘మేజర్’ సినిమాకి అడివి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉండే జనాల్లోకి తీసుకువెళ్ళడం కోసం.. ప్రీవ్యూస్ వేసేందుకు రెడీ అయ్యాడు. 9 ప్రధాన నగరాల్లో వేయనున్న ఈ ప్రివ్యూ స్క్రీనింగ్.. మే 24వ తేదీ నుంచి…
తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లను అమాంతం పెంచేయడం వల్ల, సాధారణ ఆడియన్స్ థియేటర్లకు రావడం చాలావరకు తగ్గించేశారు. ఈ దెబ్బకు.. కలెక్షన్ల పరంగా చాలా చిత్రాలు ప్రభావితం అయ్యాయి. చాలా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది గమనించిన మన మేకర్స్.. టికెట్ రేట్ల విషయమై తలొగ్గుతున్నారు. ఆల్రెడీ ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లే పెడుతున్నామని నిర్మాత దిల్‌రాజు ప్రకటించేశారు. ఇప్పుడు మేజర్ సినిమాకీ సాధరణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని హీరో అడివి శేష్…
ముంబై అటాక్ లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని మే 27న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనే అదే రోజున జనం ముందుకు తమ…