Tarakaratna: టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో మొదటి రోజే అపశృతి చోటుచేసుకుంది. నందమూరి వారసుడు నందమూరి తారకరత్న కళ్ళు తిరిగి కిందపడిపోవడం సంచలనంగా మారింది. అయితే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేశారని గుండె రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్ లు ఉన్నట్లు తెలిపారు. ఇక తారకరత్న పడిపోయిన కొద్దిసేపటికే ఆయన బాడీ నీలం రంగులోకి మారిపోయిందని అక్కడ చూసిన వారు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మెరుగైన చికిత్స కోసం ఆయనను బెంగుళూరుకు తరలించినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. అయితే అసలు తారకరత్న శరీరం నీలంగా మారడానికి కారణం ఏంటి..? అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇక ఈ విషయమై డాక్టర్ ముఖర్జీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
Jamuna: జమున కు తలకొరివి పెట్టిన కూతురు.. కొడుకు ఏమయ్యాడు..?
తారకరత్న బాడీ నీలంగా మారడానికి కారణం అతని శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడమే అని చెప్పుకొచ్చారు. ” ఒక మనిషి శరీరంలోని రక్తం అన్ని అవయాలకు అందకుండా ఉంటుందో.. అప్పుడు అవయవాల చివరన అనగా.. చేతి వేళ్లు చివరన, కాలి వేళ్లు చివరన, పెదాలు నీలం రంగులోకి మారతాయి. ఇప్పుడు తారకరత్న విషయంలో కూడా అదే జరిగింది. అతడి బాడీలో రక్త ప్రసరణ సరిగ్గా లేదు. రక్తంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అయిపోయింది.. ఆక్సిజన్ తక్కువ అయ్యింది. అలాంటప్పుడు ఆ హిమోగ్లోబిన్ అనేది బ్లూ గా మారిపోతుంది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.