నందమూరి తారక రత్న అకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. మోకిలలో ఉన్న తారకరత్న సొంత ఇంటిలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. సినీ పెద్దలు, ఇండస్ట్రీ వర్గాలు తారక రత్న భౌతికకాయాన్ని సందర్శిస్తున్నారు. నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుడు అయిన మాదాలరవి తారకరత్న అంత్యక్రియల గురించి మీడియాతో మాట్లాడుతూ… “అంత్యక్రియలకి సంబంధించి, ఇప్పుడే విజయ సాయి రెడ్డితో మాట్లాడడం జరిగింది. బాలయ్య పెట్టిన ముహూర్తం ప్రకారం రేపు ఉదయం 8:45 నిమిషాలకి ఇక్కడి నుంచి వారి భౌతిక కాయాన్ని ఛాంబర్ కి తీసుకోని వెళ్లడం జరగుతుంది. 3:30 నుంచి మహాప్రస్థానంలో తారక రత్న అంత్యక్రియలు ప్రారంభం అవుతాయి. ఈ కార్యక్రమం మొత్తం బాలయ్య పెట్టిన ముహూర్తం ప్రకారమే జరుగుతుంది. అంత్యక్రియలకి బాలయ్య పెట్టిన ముహూర్తాన్నే అందరం ఫాలో అవుతున్నాం” అని మదాల రవి తెలిపారు. TFI తరపున CCL ఆడుతున్న సమయంలో తారకరత్న, తనతో చాలా స్నేహంగా ఉండే వారని తారకరత్నతో ఉన్న బంధం గురించి మాదాల రవి మాట్లాడారు.
Read Also: Taraka Ratna: తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు.. కన్నీధారను ఓదార్చేవారెవరు