నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు మాదాల రవి. ప్రోగెసివ్ సినిమాలు చేసిన మాదాల రంగారావు గారి కొడుకు అయిన మాదాల రవికి చిన్నప్పటి నుంచే తారకరత్నతో మంచి అనుబంధం ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తరచుగా కలిసి మాట్లాడుకునే వాళ్లు. టాలీవుడ్ తరపున CCL ఆడే సమయంలో మాదాల రవి, తారక రత్న ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడే వాళ్లు. అలా చిన్నపటి నుంచి ఉన్న స్నేహం మరింత పెరిగింది. ప్రస్తుతం…
నందమూరి తారక రత్న అకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. మోకిలలో ఉన్న తారకరత్న సొంత ఇంటిలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. సినీ పెద్దలు, ఇండస్ట్రీ వర్గాలు తారక రత్న భౌతికకాయాన్ని సందర్శిస్తున్నారు. నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుడు అయిన మాదాలరవి తారకరత్న అంత్యక్రియల గురించి మీడియాతో మాట్లాడుతూ… “అంత్యక్రియలకి సంబంధించి, ఇప్పుడే విజయ సాయి రెడ్డితో మాట్లాడడం జరిగింది. బాలయ్య పెట్టిన ముహూర్తం ప్రకారం రేపు ఉదయం 8:45 నిమిషాలకి ఇక్కడి…