తెలుగులో ఈ యేడాది తొలి ప్రథమార్ధంలో వచ్చిన అనువాద చిత్రాలు ‘కేజీఎఫ్, విక్రమ్’ మంచి విజయం సాధించాయి. దాంతో మన నిర్మాతలు, పంపిణీదారుల దృష్టి పరభాషా చిత్రాల తెలుగు హక్కులపై పడింది. అలా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ హక్కులను సొంతం చేసుకున్నారు. తొలి నుండి ప్రయోగాత్మక చిత్రాలకు విక్రమ్ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు. అలానే దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తుకూ మంచి…
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై స్పష్టట నెలకొంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఉత్వర్వుల జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై టాలీవుడ్ సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ. ఏపీ ప్రభుత్వం మా విన్నపాలను కొంత వరకు అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా మిగిలిన సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అభిప్రాయం వ్యక్తం…
ఏపీలో థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడి చాలా థియేటర్లలో రూల్స్ పేర్లతో ‘భీమ్లా నాయక్’ ప్రదర్శితం కాకుండా అడ్డుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు. పైగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం కొన్ని థియేటర్ల దగ్గర పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కన్పించడం చర్చనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపి ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కాదు… థియేటర్ల వ్యవస్థ…
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ కోరాడు. థియేటర్ల సమస్యలపై ప్రభుత్వం నెలరోజులు సమయం ఇవ్వడం సంతోషంగానే ఉన్నా… థియేటర్ల సీజ్ అంశంపై పని ఒత్తిడిలో ఉండే జాయింట్ కలెక్టర్‌లను కలిస్తే ఉపయోగం ఏం ఉంటుందని ప్రశ్నించారు. కరోనాతో రెండేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఓటీటీ కారణంగా ఎన్నో నష్టాలకు గురయ్యామని ఎన్వీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.…
ఏపీ మంత్రి పేర్నినాని సినీ ప్రముఖులతో నేడు సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఆదిశేషగిరిరావు, యువి క్రియేషన్స్ వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సి. కళ్యాణ్, డివివి దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, పంపిణీదారులు ఎల్వీఆర్, సత్యనారాయణ, వీర్రాజు, అలంకార్ ప్రసాద్, ఒంగోలు బాబుతో పాటు పలువురు థియేటర్ల యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఓ సినిమా థియేటర్ యజమాని సినిమా టిక్కెట్…
సినిమా టికెట్ ఆన్ లైన్ అనేది తప్పని సరి వ్యవహారంగా ఎపి మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం చిత్ర ప్రముఖులతో జరిగిన సమావేశంలో సినిమా పరిశ్రమతో పాటు థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా సినిమా టికెట్ రేట్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమావేశంలో ఒక ఎగ్జిబిటర్ కన్నీటి పర్యంతం అవటం సమస్య తీవ్రతను తెలియచేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లతో థియేటర్స్ రన్ చేయలేం అంటూ అతడు కళ్ల నీళ్లు…