Virumaan: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అదితి శంకర్ జంటగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరుమాన్. ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఈ సినిమాను కార్తీ అన్న హీరో సూర్య నిర్మించడం విశేషం. కోలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్స్ రాబట్టడంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా చిత్ర బృందానికి కాస్ట్లీ గిఫ్ట్ ను అందించారు. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తి వేలన్.. చిత్ర బృందం కు డైమండ్ బ్రాస్ లైట్స్ ను గిఫ్ట్ గా అందించాడు. డైరెక్టర్ ముత్తయ్య కు డైమండ్ రింగ్ ఇవ్వగా.. సూర్య, కార్తీలకు బ్రాస్ లైట్స్ ను ఇచ్చాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇటీవల విక్రమ్ హిట్ అవ్వడంతో కమల్ కూడా చిత్ర బృందానికి గిఫ్ట్స్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఏదిఏమైనా థియేటర్లన్నీ కళకళలాడుతూ ప్రేక్షకులను మెప్పించడం కన్నా పెద్ద గిఫ్ట్ తమకు ఏది ఉండదని ఈ అన్నదమ్ములు చెప్పడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం సూర్య, బాలా దర్శకత్వంలో అచలుడు సినిమాలో నటిస్తున్నాడు. ఇక కార్తీ, మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలు ఈ అన్నదమ్ములకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Marking the colossal blockbuster success of #Viruman, Tamil Nadu distributor @SakthiFilmFctry @sakthivelan_b gifted diamond bracelets to @Suriya_offl @Karthi_Offl @rajsekarpandian and Diamond ring to @dir_Muthaiya pic.twitter.com/n9AyocMgVx
— BA Raju's Team (@baraju_SuperHit) August 17, 2022