Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పటికీ చెక్కు చెరదని అందాలతో గ్లామర్ డోస్ పెంచుతోంది. తమన్నా మీద ఎప్పటికప్పుడు రూమర్లు వస్తూనే ఉంటాయి. అప్పట్లో ఓ పాకిస్థాన్ క్రికెటర్ తో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి అంటూ ఎన్నో రూమర్లు క్రియేట్ అయ్యాయి. వాటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
Read Also : Chiranjeevi : సీఎం రేవంత్ ను కలిసిన చిరంజీవి
ఇందులో తమన్నా మాట్లాడుతూ.. నాపై రూమర్లు కొత్తేం కాదు. ఆ పాకిస్థాన్ క్రికెటర్ తో ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్నాను. అంతే అప్పటి నుంచి అతనితో నాకు పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. అతనితోనే కాదు.. విరాట్ కోహ్లీతోనూ నాకు పెళ్లి అంటూ ఎన్నో రూమర్లు క్రియేట్ చేశారు. ఇలాంటివి చూసినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రతి సారి నేను స్పందించలేను. కానీ నేనేంటో నా ఫ్యామిలీకి తెలుసు’ అంటూ క్లారిటీ ఇచ్చింది తమన్నా.
Read Also : Tamannaah : వాళ్లు నా బాడీని అలానే చూస్తారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్