Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు బాహుబలితోనే నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. ఇందులో ఆమె అవంతిక పాత్రలో చూపించిన అందం, అభినయం అందరినీ మంత్ర ముగ్దుల్ని చేసి పడేసింది. అయితే ప్రభాస్ కు, తమన్నాకు మధ్య ఉన్న రొమాంటిక్ సీన్లపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఆ రొమాంటిక్ సీన్లను అవంతికపై రేప్ అటెంప్ట్ గా ప్రచారం చేశారు. ఈ కాంట్రవర్సీపై అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. వాటిపై తాజాగా స్పందించింది తమన్నా. ఆ సీన్ లో ఎలాంటి కాంట్రవర్సీ లేదని తెలిపింది.
Read Also : Allu Aravind : అల్లు అరవింద్ చాకచక్యం.. లాభాల పంట
ఒక పురుషుడిగా తనలోని స్త్రీని అతను గుర్తించాడని.. ఆ సీన్ కు అదే అర్థం అని చెప్పింది. ‘ఆ సీన్ ను తప్పుగా చూసే వారికి అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. వాళ్లు నా బాడీని అలాగే చూస్తారు. ఒక సీన్ లోని అర్థాన్ని తెలుసుకోలేని వారికి ఏది చూసినా అలాగే అనిపిస్తుంది. అలాంటి వాటి గురించి నేను పట్టించుకోను. ఆ సీన్ అవంతికపై రేప్ అని నేను అనుకోను. ఒక పురుడుగా అతను నా లోని అందాన్ని బయట పెట్టాడనే అనుకుంటాను. నన్ను నాకు గుర్తు చేయడమే ఆ సీన్ కు అర్థం’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
Read Also : Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ అల్లరి..