Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి బొకే ఇచ్చి, శాలువాతో సత్కరించారు సీఎం రేవంత్. అనంతరం ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ కు, చిరంజీవికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
Read Also : Gowtham Tinnanuri : రామ్ చరణ్ తో మూవీ అందుకే చేయలేదు
కొద్ది సేపటి క్రితమే ఫిల్మ్ ఫెడరేషన్ సోమవారం నుంచి షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చింది. 30 శాతం వేతనాలు పెంచిన నిర్మాతల షూటింగులకు మాత్రమే కార్మికులు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ విషయం గురించి కూడా చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎంను సడెన్ గా చిరంజీవి ఎందుకు కలిశారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Coolie : నాగార్జునను సూర్యతో పోలుస్తున్న నెటిజన్లు..