Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేను నటనను కేవలం ప్రొఫెషన్ గా మాత్రమే చూడలేదు. అది నా లైఫ్ అనుకున్నాను. నేను టెన్త్ చదువుతున్నప్పుడే సినిమాల్లోకి వచ్చాను. ఇంటర్ నుంచి పెద్దగా కాలేజీకి కూడా వెళ్లలేదు. నా అసైన్ మెంట్స్ అన్నీ నా కాలేజీ టీచర్లే రాసేవారు. వాళ్లకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. నా కెరీర్ సౌత్ లోనే మొదలైంది. హీరోయిన్ గా నన్ను సౌత్ ప్రేక్షకులు గుర్తించారు. వాళ్ల సపోర్ట్ ఎన్నడూ మరువలేను’ అంటూ తెలిపింది.
Read Also : Ravi Naidu: రోజాను అరెస్టు చేయడానికి దమ్ము అవసరం లేదు.. వారెంట్ ఉంటే చాలు
‘నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు బర్త్ డే కోసం ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు నేను తమిళ పేపర్లలో ఓ వార్త చదివాను. అందులో నేను నెంబర్ వన్ హీరోయిన్ అని అందులో రాశారు. అది చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ఇప్పుడు బాలీవుడ్ లోనే రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే సౌత్ లో ఓ భారీ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోది. ప్రస్తుతం చర్చల దశలో ఉందంట. ఇక ప్రియుడు విజయ్ వర్మతో ఆమెకు బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ చివరకు విడిపోయారు.