Taapsee Blurr Trailer Released: కొత్త కంటెంట్‌తో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్న నటి తాప్సీ. నమ్మిన దారిలో వెళుతూ నటిగా మంచి పేరు తెచ్చుకున్న తాప్సీ.. త్వరలో ‘బ్లర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. డిసెంబర్ 9న రానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. 2010లో వచ్చిన స్పానిష్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇంతకుముందు తాప్సీ, అమితాబ్ బచ్చన్‌తో కలసి నటించిన ‘బద్లా’తో పాటు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘దోబారా’ కూడా స్పానిష్ సినిమాల ఆధారంగానే రూపొందినవి కావటం విశేషం. సూపర్‌హిట్ స్పానిష్ చిత్రాలైన ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’, ‘మిరాజ్’కి అవి రీమేక్స్.
ఇదిలా ఉంటే ‘బ్లర్’ ట్రైలర్‌తో ఆడియన్స్‌లో ఆసక్తిని మరింత పెంచింది తాప్సి. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాతల్లో తాప్సి కూడా ఒకరు. అజయ్ బెహెల్ దర్శకత్వం వహించిన ఈ ‘బ్లర్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో డైరెక్ట్‌గా విడుదల కాబోతోంది. ఇందులో తాప్సీ పాక్షికంగా గుడ్డి అమ్మాయిగా కనిపించనుంది. తన సోదరి మరణం వెనుక ఉన్న నిజాన్ని కనిపిట్టే పాత్ర ఇది. తాప్సితో పాటు గుల్షన్ దేవయ్య, కృతిక దేశాయ్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. డిసెంబర్ 9న విడుదల కాబోతున్న ఈ సినిమా తాప్పికి ఎలాంటి పేరు తెస్తుందో చూద్దాం!