Suryadevara Naga Vamsi Comments on Dubbing Films: తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘లియో’ మీద అటు తమిళ్లోనే కాదు ఇటు తెలుగులో కూడా మాంచి డిమాండ్ ఉంది. త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు సహా తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాను నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మ్యాడ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ‘లియో’ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను రూ. 22 కోట్లు ఖర్చు చేసి నాగ వంశీ తీసుకున్నారు.
Bus Stop: ఇదేందయ్యా ఇదీ.. రాత్రికి రాత్రే బస్టాండ్‌ను ఎత్తుకెళ్లారు!
ఒకరకంగా ఈ సినిమా బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాకి పోటీగా బరిలోకి దిగుతోంది. రెండు సినిమాలు అక్టోబర్ 19న పోటీ పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో నాగ వంశీ మాట్లాడుతూ ‘లియో’ రైట్స్ ను తాను భారీ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేశానని చెబుతూనే అలా అంత ఖర్చు చేసి రిలీజ్ చేస్తున్నప్పుడు లాభాలు పొందాలని ఉంటుంది కానీ, నష్టం వచ్చేలా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటానని ఆయన ప్రశ్నించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇకపై డబ్బింగ్ సినిమాలను తాను తెలుగులో విడుదల చేయనని.. ‘లియో’నే మొదటి సినిమా అదే ఆఖరి సినిమా కూడా అని ఆయన కామెంట్ చేశారు. మరోపక్క నాగవంశీ సమర్పణలో ఆయన సోదరి హారిక నిర్మించిన ‘మ్యాడ్’ సినిమా ఈ రోజు విడుదలై సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ దిశగా దూసుకుపోతోంది.