సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ని ఏలిన స్టార్ హీరోల్లో కృష్ణ ఒకరు.. ప్రస్తుతం వయో వృద్ధాప్యంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఎప్పుడైనా ఘట్టమనేని ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప బయట ఎక్కడ కృష్ణ కనిపించడం లేదు. ఇక తాజాగా కృష్ణకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఈ ఫోటో చూసి కృష్ణకు ఏమైంది అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఘట్టమనేని ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ లో కృష్ణ పాల్గొన్నారు. ఆ వీడియోను ఆయన కూతురు, మహేష్ అక్క మంజుల తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కుర్చీలో కూర్చున్న కృష్ణ ఫేస్ లో ఏదో తేడా కనిపిస్తున్నట్లు అభిమానులు గుర్తించారు.
ముఖమంతా మచ్చలు వచ్చినట్లు అనిపించడంతో కృష్ణ ఏదైనా అనారోగ్యానంతో బాధపడుతున్నారా.? అని ఆందోళన చెందుతున్నారు. అయితే కృష్ణ ఆరోగ్యం బావుంది.. అది ఆయన ధరించే మాస్క్.. ఇన్విజిబుల్ గా ఉండే ఈ మాస్క్ పేస్ లో కలిసిపోవడం వలన కృష్ణ ముఖం అలా కనిపించింది. కొంచెం ఆ ఫోటోను తీక్షణంగా చూస్తే అది మాస్క్ అని అర్థమైపోతుంది. ఇక కృష్ణ గారి ఆరోగ్యం బావుందని. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని, అది ఫేస్ మాస్క్ మాత్రమే అని ఆయన సన్నిహితులు కూడా చెప్తుండడంతో అభిమానులు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.