మంచు విష్ణు ప్రస్తుతం ఇషాన్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అవ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. గాలి నాగేశ్వరరావు గా విష్ణు ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం సన్నీ భారీగా పారితోషికం తీసుకున్నదట.
కేవలం 15 రోజులు మాత్రమే ఈ చిత్రం కోసం కేటాయించిన సన్నీ మరో ఐదు రోజులు ప్రమోషన్ కార్యక్రమాల కోసం రానున్నదట. కేవలం 20 రోజుల కోసం మంచు ఫ్యామిలీ, సన్నీకి రెండు కోట్లు ముట్టజెప్పారట. ఇందులో సన్నీ, విష్ణు మధ్య రొమాంటిక్ సీన్స్ గట్టిగానే ఉండనున్నాయట. అయితే అవన్నీ కథలో భాగమేనని అంటున్నారు. అయినా కేవలం 20 రోజుల కోసం రెండు కోట్లా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా అంత తీసుకోవడం లేదుగా అని నెటిజన్లు నోర్లు వెళ్లబెడుతున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.