దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల ఆమధ్య ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి వరం రోజులే సమయం ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఒకపక్క దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లను నిర్వహిస్తూనే శోకాలు ఇండియాలో ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక ఇంటర్వ్యూ, సంగీత దర్శకుడు కీరవాణితో మరో ఇంటర్వ్యూ జరిపి ఆసక్తి పెంచిన ఆర్ఆర్ఆర్ త్రయం తాజాగా యాంకర్ సుమతో మీమర్స్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయగా.. ఆ ఇంటర్వ్యూ ను ఇటీవలే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక సుమ ఎక్కడ ఉంటె అక్కడ నవ్వులే.. కానీ ఇక్కడ మాత్రం తారక్ సుమపై పంచులు వేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది.
ఇక మీమర్స్ స్పెషల్ అని అనడమే కాకుండా ఇంటర్వ్యూ మొత్తం మీమ్స్ తోనే సాగేలా చేశారు. సినిమా మొదలైనప్పటినుంచి.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేవరకు వచ్చిన మీమ్స్ ని చూపించి సుమ ఆసక్తికరమైన విషయాలను రాబట్టింది. ఇక సుమ పై తారక్ పంచులు వేస్తూనే ఉండడంతో ఆమె కొద్దిగా చిన్నబుచ్చుకోవడం ఇంటర్వ్యూకే హైలైట్ గా మారింది. ఇక చివర్లో మీమర్స్ కి రాజమౌళి థాంక్స్ చెప్పడం గమనార్హం. వారు ఇంత క్రియేటివ్ గా చేయడం మాములు విషయం కాదని, తమ సినిమాపై ఇంత అభిమానం చూపించినందుకు ధన్యవాదాలని తెలిపారు. ఇక మొత్తానికి సుమ, తారక్ పంచులతో ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్ ఇంటర్వ్యూ పై ఓ లుక్కేసేయండి.