Sukumar Creates a new record with 100 crore Remuneration: సుకుమార్ ఆయనో లెక్కల మాస్టారు, పుష్ప ముందు వరకు తెలుగు ఇండస్ట్రీలో అది రిలీజ్ అయ్యాక ఇండియా వైడ్ గా పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయాడు. అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా గోదావరి జిల్లాల నుంచి బస్సెక్కి హైదరాబాద్ వచ్చిన సుకుమార్ ఆర్య సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. తన లెక్కలతో సినిమాల బాక్సాఫీస్ లెక్కలు మార్చేస్తుండే ఈ లెక్కల మాస్టారు మొదట్లో అర్థం కాని విధంగా హాలీవుడ్ ను పోలి ఉన్న సినిమాలు చేసేవాడు. కానీ తెలుగోళ్ల మాస్ పిచ్చి అర్ధం అయిందో ఏమో కానీ మనసు పెట్టి మాస్ సినిమా తీసి రంగస్థలం దెబ్బ చూపించాడు సుకుమార్. ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచేసి, మగధీర తర్వాత ఆ స్థాయి విజయం కోసం పదేళ్లుగా వేచి చూస్తున్న రామ్ చరణ్ ఆకలి మొత్తం తీర్చేసి అతని లోని ఒక కొత్త నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా చేసి రికార్డులు అన్నిటినీ మడత పెట్టేశాడు.
Ileana : ఎట్టేకలకు భర్తను పరిచయం చేసిన ఇలియానా..
అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టడమే కాదు ఇండియా వైడ్ ఐకాన్ స్టార్ ను చేసేశాడు. అయితే దర్శకుడిగానే ఉండి పోకుండా సుకుమార్ తాను దర్శకుడిగా ఉన్న సినిమాలతో పాటు బయటి హీరోలకు కూడా కథలు రాస్తున్నాడు. వాటిని తన సొంత నిర్మాణంలోనే నిస్సామిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో వరస సినిమాలు చేస్తూ తనదగ్గర సత్తా చాటిన అసిస్టెంట్లను డైరెక్టర్లను చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సుకుమార్ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. అదేంటి ఆయన చేసిన సినిమాలు ముందే 100 కోట్లు కొట్టాయి కదా అనుకుంటున్నారా? అయితే కలెక్షన్స్ విషయం కాదండోయ్ రెమ్యునరేషన్ విషయం. రాజమౌళి తర్వాత 100 కోట్ల పారితోషికం అందుకున్న రెండో తెలుగు దర్శకుడుగా సుకుమార్ నిలిచాడు. “పుష్ప 2” కోసం మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ కి ఇచ్చేందుకు అంగీకరించిన మొత్తం 100 కోట్ల పైమాటే.
YS Sharmila: కేసీఆర్‌లాంటి అహంకార సీఎం చరిత్రలో లేరు
సుకుమార్ OTT డీల్ లో వాటాతో పాటు ఆయనకి ఒక గట్టి పే చెక్ కూడా అందుకోనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల పుష్ప 2 OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు రికార్డ్ ధరకు విక్రయించింది. ఇక “పుష్ప పార్ట్ 1” కంటే ముందు సుకుమార్ సినిమా చేసేందుకు 25 కోట్ల రూపాయలు తీసుకునేవారు కానీ ఆయన రెమ్యునరేషన్ ఇప్పుడు 100 కోట్లకు చేరుకుంటుంది. సుకుమార్ మొత్తం మొత్తం రూ. 100 కోట్లు (ఫిక్స్‌డ్ పేచెక్ + OTT డీల్‌లో వాటా) అందుకున్నాడని అంచనాలు వెలువడుతున్నాయి. ‘పుష్ప 2’ సినిమా ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది. ఈ సినిమా ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి భాగం సంచలన విజయం సాధించినప్పటి నుండి ఈ రెండో పార్ట్ మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలే లెక్కల మాస్టారు లెక్కలను 100 కోట్లు దాటించాయి.