తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ ని హీటేక్కిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి పోటిగా తన ‘వారసుడు’ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. బిగ్ స్క్రీన్ థియేటర్స్, మంచి ఫెసిలిటీస్ ఉన్న థియేటర్స్, మేజర్ నంబర్ ఆఫ్ సింగల్ స్క్రీన్స్ ని దిల్ రాజు ‘వారసుడు’ సినిమా కోసం బ్లాక్ చేశాడు. దీంతో పండగ సీజన్ లో తెలుగు సినిమాలకి కాకుండా డబ్బింగ్ సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాడు అంటూ దిల్ రాజుపై విమర్శలు మొదలయ్యాయి. ఎవరు ఏమనుకున్నా తన పంథా మాత్రం మారదు అంటూ దిల్ రాజు, తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
జనవరి 12ని వారసుడు కోసం బుక్ చేసుకున్న దిల్ రాజు, ఫిబ్రవరి నెలలో కూడా తగ్గేదేలే అంటున్నాడు. ఫిబ్రవరి నెలలో విశ్వక్ సేన్ నటిస్తున్న ‘ఢమ్కీ’, గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’, సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘సార్’ సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ అయ్యాయి. వీటికి షాక్ ఇస్తూ దిల్ రాజు, సమంతా నటించిన ‘శాకుంతలం’ సినిమాని ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. గుణ టీం వర్క్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ పాన్ ఇండియా సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. దాదాపు అన్ని మేజర్ సెంటర్స్ లోని పెద్ద థియేటర్స్ ని దిల్ రాజు ‘శాకుంతలం’ సినిమా కోసం బ్లాక్ చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో గీత ఆర్ట్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి బ్యానర్ ని దిల్ రాజు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. అయితే ఎండ్ ఆఫ్ ది డే, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ బిజినెస్ అండ్ మేకింగ్ మనీ కాబట్టి దిల్ రాజు ‘శాకుంతలం’ సినిమాని రిలీజ్ చెయ్యడంలో ఎలాంటి తప్పు కనిపించట్లేదు.
తన సినిమాలని మార్కెట్ చేసుకోవడం దిల్ రాజు రైట్, ఇది ఒక బిజినెస్ గా మాత్రమే చూస్తే దిల్ రాజు చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదు అంటూ దిల్ రాజుకి సపోర్ట్ చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే, ‘వారసుడు’ రిలీజ్ డేట్ ని మేము ముందుగా అనౌన్స్ చేసాం… మా తర్వాత మిగిలిన వాళ్లు అనౌన్స్ చేశారు అని ఎథికల్ గా కరెక్ట్ కాదని చెప్తున్న దిల్ రాజు, అదే లాజిక్ ని ఫిబ్రవరి నెలలో ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాలకి కూడా వర్తిస్తుందని గుర్తిస్తాడా? లేక శాకుంతలం సినిమాతో ఇతర ప్రొడ్యూసర్స్ ని ఇబ్బందులు పెడతాడా అనేది చూడాలి.