బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి ఇండస్ట్రీలో వారే తోపు హీరోలు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు. నార్త్, సౌత్ బెల్ట్‌లో ఓ ఊపు ఊపేసిన ఈ ఇద్దరు స్టార్స్ కెరీర్ ఓ దశకు చేరుకుంది. ఒకరు ఆచితూచి సినిమాలు చేస్తుంటే మరొకరు పాలిటిక్స్ అంటూ పరుగులు పెడుతున్నారు. హీరోల డెసిషన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినా.. వీరి వారసుల ఆ చరిష్మాను కంటిన్యూ చేస్తారని వెయిట్ చేస్తున్నారు. కానీ స్టార్ కిడ్స్ మాత్రం యాక్షన్ వద్దు డైరెక్షన్ ముద్దు అని అటువైపు అడుగులు వేస్తున్నారు.
Also Read : Nithiin : విజయ్ దేవరకొండ కోసం త్యాగం చేసిన నితిన్
బాద్ షా సన్ ఆర్యన్ ఖాన్, విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ఆ మార్గంలోనే ప్రయాణం మొదలు పెట్టారు. ఆర్యన్ ఖాన్ మెగాఫోన్ పట్టి ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే ఓటీటీ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. అతడి ఫస్ట్ డెబ్యూ డైరోక్టోరియల్లో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, ఆలియా భట్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి టాప్ యాక్టర్స్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. ఇక తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అతడి సినీ కెరీర్ సినారియో మొత్తం మారిపోయింది. ఆయన వారసుడిగా కొడుకు జాసన్ సంజయ్ ఆ బాధ్యతలు టేకప్ చేస్తాడనుకుంటే యాక్టింగ్ కాదు డైరెక్టర్ అవుతా అంటూ మెగాఫోన్ పట్టాడు. టొరంటో ఫిల్మ్ స్కూల్లో చదివిన సంజయ్ షార్ట్ ఫిల్మ్స్ తో మెప్పించాడు. ఆ అనుభవంతో కెమెరాను హ్యాండిల్ చేస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా తొలి మూవీని డైరక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టును లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇలా ఇద్దరి స్టార్ కిడ్స్ యాక్షన్ కంటే డైరెక్షన్ బెటర్ అని ముందుకు సాగుతున్నారు.