లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలందరి పక్కన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది శృతి హాసన్. రవితేజతో హిట్ కాంబినేషన్ ఉన్న శృతి హాసన్… బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉంటుంది. గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు ఎలిమెంట్స్ ఉన్న శృతి హాసన్ కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తోంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ సినిమాలో శృతి హాసన్ ‘ఆధ్య’ పాత్రలో నటిస్తోంది. సలార్ సినిమా రిలీజ్ అయితే శృతి హాసన్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోతుంది.
సలార్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అనుకుంటే శృతి హాసన్ మరో పాన్ ఇండియా సినిమాతో సలార్ కన్నా ముందే ఆడియన్స్ ముందుకి వస్తుంది. నాని నటించిన లేటెస్ట్ సినిమా ‘హాయ్ నాన్న’. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజులో డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు ఉంది. హాయ్ నాన్న మేకర్స్ ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచి పెట్టి.. ట్రైలర్ లో ఒక చోట మాత్రం ఒక క్లోజప్ లో శృతి హాసన్ ఫేస్ ని రివీల్ చేసారు. హాయ్ నాన్న ట్రైలర్ లో శృతి హాసన్ ని చుసిన వాళ్లు షాక్ అయ్యారు. ఈ విషయాన్నీ మేకర్స్ బయటకి రాకుండా బాగానే మేనేజ్ చేసారు. మరి హాయ్ నాన్న సినిమాలో శృతి హాసన్ ఎంత సేపు కనిపించనుంది? ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేసింది అనేది తెలియాలి అంటే డిసెంబర్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే.