Sriya Reddy Background: ప్రభాస్ నటించిన సాలార్ చిత్రంలో వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సవతి సోదరిగా, రాజమన్నార్(జగపతి బాబు) కుమార్తెగా రాధా రామ పాత్రలో నటించిన తమిళ నటి శ్రియా రెడ్డి ప్రస్తుతం వైరల్ అవుతుంది. సినిమాలో ఆమె నటనతో పాటు లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సలార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆమె పాత్రను ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పోషించిన శివగామితో పోలుస్తున్నారు అంటే ఆమె ఇంపాక్ట్ ఎంతలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఆమె నటనకు ఫిదా అయిన అభిమానులు, ఇప్పుడు ఆమె ఎవరు? ఇంతకు ముందు ఏమైనా సినిమాల్లో నటించారా? అని కూడా సెర్చ్ చేస్తున్నారు.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియా, గూగుల్ లో ఆమె కోసం వెతుకుతున్నారు. నిజానికి శ్రేయా రెడ్డి గురించి చెప్పాలంటే ఆమెకు సినీ నేపథ్యంతో పాటు క్రీడా నేపథ్యం కూడా ఉంది. శ్రియా రెడ్డి తండ్రి పేరు ‘భరత్ రెడ్డి’. అతను 1978-1981 మధ్య క్రికెట్ ఆటగాడిగా భారత జట్టులో అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం భారత టెస్ట్ క్రికెటర్లుగా ఉన్న దినేష్ కార్తీక్ – లక్ష్మీపతి బాలాజీలకు కూడా భరత్ రెడ్డే శిక్షణ ఇచ్చారు.
Ram Charan: ‘క్లింకార’తో చరణ్-ఉపాసన మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్
భరత్ రెడ్డి, శ్రియా రెడ్డి చెన్నైలో సెటిల్ అయిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఇక హీరో విశాల్‌కి శ్రియా రెడ్డికి మధ్య కూడా సంబంధం ఉందండోయ్. అదేమంటే విశాల్ కి శ్రియా రెడ్డి వదిన అవుతుంది. విశాల్ అన్నయ్య ‘విక్రమ్ కృష్ణ’ని శ్రియా రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంది. విశాల్ కంటే ముందు ఇండస్ట్రీలోకి వచ్చిన విక్రమ్ కృష్ణ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పి ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాడు. ఇక శ్రియా రెడ్డి, విక్రమ్ కెరీర్ స్టార్టింగ్‌లో ‘సదరన్ స్పైస్ మ్యూజిక్’లో వీజేలుగా పనిచేసేవారు. అక్కడ వారు కలుసుకున్నా తర్వాత అది ప్రేమగా మారి పొగరు సినిమా తరువాత ఇద్దరూ 2008లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక శ్రియా రెడ్డి సినిమా రంగానికి దూరమైంది. గతేడాది వరకు అమెరికాలో ఉన్న శ్రియారెడ్డి మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ‘సుడల్’ అనే వెబ్ సిరీస్‌తో ఆమె రీఎంట్రీ ఇచ్చారు. తెలుగు చిత్రసీమలో నటిగా అప్పుడప్పుడు అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన శ్రియా రెడ్డి. 2003లో విశాల్ నటించిన ‘పొగరు’ సినిమాతో ఓ సినిమాలో నటించిన శ్రియా రెడ్డికి నటిగా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్‌గా శ్రియ నటించింది.