థియేటర్ల రీఓపెన్ తరువాత హిట్ టాక్ తెచ్చుకున్న మొదటి చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. తాజాగా ఈ సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “ఎస్ఆర్ కళ్యాణమండపం” మూవీ ఆగస్ట్ 28న ప్రముఖ ఓటిటి వేదిక ఆహాలో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఏపీ/టీఎస్ నుండి మొదటి రోజున ఈ చిత్రం 1.23 కోట్లు వసూలు చేసింది. ఏపీలో 50% ఆక్యుపెన్సీ ఆంక్షలు ఉన్నప్పటికీ సినిమా బాగా ఆడడం విశేషం. ఇప్పుడు సినిమా డిజిటల్ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తుందో లేదో చూడాలి.
Read Also : ట్రైలర్ : సేల్ లో డిస్కౌంట్ బ్యాచ్ కాదు… హోల్ సేల్ గా లేపేసే బ్యాచ్
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ ఎస్ఆర్ కళ్యాణమండపం”లో జంటగా నటించారు. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో ప్రముఖ నటుడు సాయి కుమార్ తో పాటు తనికెళ్ళ భరణి కూడా నటించారు. అరుణ్, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్, భరత్, కిట్టయ్య తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించగా, ప్రమోద్, ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీత స్వరకర్త. ఆయన అందించిన సినిమాకు ప్రాణంగా నిలిచింది. మొత్తానికి “ఎస్ఆర్ కళ్యాణమండపం” ఇలాంటి సమయాల్లో మిగతా సినిమాలు ధైర్యంగా థియేటర్లలోకి రావడానికి మంచి బూస్ట్ ఇచ్చింది.