కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చిత్ర పరిశ్రమను కలిచివేసింది. జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన పునీత్ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఒక పక్క ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకులేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే.. మరోపక్క కొంతమంది డబ్బుకోసం ఆయన మృతిని ప్రచారం కింద వాడుకుంటున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేసినట్లే తెలుపుతూ.. దాని కింద వారి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
పునీత్ మరణాన్ని కొన్ని డయాగ్నోస్టిక్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఆయన ఫోటో పెట్టుకొని దానికింద గుండెపోటు రాకుండాఏం చేయాలి..? పునీత్ ఎలా చనిపోయాడు..? జిమ్ లో హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటూ ప్రజలను ఆస్పత్రులకు రప్పించేలా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఒక డయాగ్నోస్టిక్స్ సెంటర్ వద్ద అప్పు కి నివాళులర్పిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానికింద 7 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు ఉచితంగా గుండె, ఇతర చెకప్‌లు చేస్తామని, మా వద్దకు బీపీ, ఈసీజీ, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకుంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అంటూ ఉంది. ఇక దీనిపై పునీత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణాన్ని వీళ్లు క్యాష్ చేసుకుంటున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. ఛీఛీ యెంత నీచానికి దిగజారారు.. ఒక మనిషి మరణాన్ని కూడా డబ్బు కోసం ఉపయోగిస్తారా ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.