Asha Borra Sensational Allegations on The Family Star: ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గీతగోవిందం దర్శకుడు పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సోదరుడు శిరీష్ తో కలిసి నిర్మించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మిక్స్ రివ్యూస్ అందుకుంది. దాదాపుగా క్రిటిక్స్ అందరూ సినిమా బాలేదని చెబుతుంటే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం థియేటర్లకి క్యూపడుతున్నారని సినిమా యూనిట్ వెల్లడించింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమాలో కేవలం ఒకే ఒక సీన్ లో కనపడిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ ఒకరు మాత్రం సినిమా యూనిట్ మీద దుమ్మెత్తి పోసింది. ఒక పెద్ద సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ సినిమా యూనిట్ కి షాక్ ఇచ్చింది.
Manjummel Boys Review: మలయాళ ఇండస్ట్రీ హిట్ ‘మంజుమ్మల్ బాయ్స్’ రివ్యూ..
ఆమె మరెవరో కాదు సోషల్ మీడియాలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వీడియోలు చేస్తూ ఉండే ఆశా బొర్రా. ఆమె సినిమా మొదలైన వెంటనే విజయ్ దేవరకొండతో కలిసి ఒకే ఒక సీన్ లో కేవలం ఒకే ఒక ఫ్రేమ్లో కనిపిస్తారు. ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చారు. నాలాంటి దాన్ని పిలిచి అవుట్ స్టఫ్ లాగా వాడుకొని వదిలేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ కాకుండా ఇంకేమవుతుంది? ఫ్యామిలీ స్టార్ కి కంగ్రాట్యులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. ఇంతోటి అఫియరెన్స్ కి నా టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకుని ఎందుకు అనవసరమైన ఫోన్లు, హంగామా? మీరు ఈ క్యారెక్టర్ చేయండి అని అసోసియేట్ డైరెక్టర్ దగ్గర నుంచి క్యాస్టింగ్ డైరెక్టర్ వరకు వరుసగా ఫోన్లు. అయినా హైదరాబాదులో జూనియర్ ఆర్టిస్టులకు కరువు వచ్చిందో? లేక సోషల్ మీడియా ఫేసెస్ వాడుకోవాలని చేశారో తెలియదు.
మా పనులు మానుకుని ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఒక రోజంతా నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి హెల్త్ మొత్తం అప్సెట్ ఉన్నా కానీ షూట్ డేట్ కి వస్తాను అని ఇచ్చిన ఒక్క మాట కోసం వచ్చాను. యాంటీబయోటిక్స్ వేసుకుని నిలువు కాళ్ళ మీద నిలబడి మరీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడి పని చేశాను. కనీసం ఒక డైలాగ్ అయినా ఉంటే ఇంత రాయాల్సిన అవసరం ఉండేది కాదేమో. ఇస్తామన్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా ట్రావెల్ ఎక్స్ పెన్సెస్ ఇవ్వకుండా హోటల్ స్టేకి డబ్బులు ఇవ్వకుండా మాకు ఏంటి సంబంధం అన్నట్టు ప్రాపర్ గా రెస్పాండ్ కూడా అవ్వకుండా చాలా గ్రేట్ కనీసం విజయ్ దేవరకొండకి నాకు ఉన్న కన్వర్జేషన్ ఉంచినా కొంత సాటిస్ఫాక్షన్ ఉండేదేమో. మీ ఎడిటింగ్ కి ఒక దండం, ఇలా జరగడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మరోసారి నాకు కళ్ళు తెరిపించారు అంటూ ఆమె రాసుకొచ్చారు.